ఎగ్జిబిటర్ సెక్టార్ ఊపిరి ఆగిపోయినట్లేనా..?
ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ రేట్ల వ్యవహారం ఓ కొలిక్కి రావడం లేదు. సినిమా టికెట్ రేట్లను తగ్గిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయగా.. హైకోర్టు దాన్ని రద్దు చేసింది. అయితే సింగిల్ బెంచ్ తీర్పును సవాలు చేస్తూ ప్రభుత్వం డివిజన్ బెంచ్ లో అప్పీల్ చేసింది. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం జీవో నెం.35 ను క్యాన్సిల్ చేసినా.. టికెట్ ధరలు జాయింట్ కలెక్టర్ ముందస్తు అనుమతితో పెంచుకోవాలని మెలిక పెట్టింది. ఈ నేపథ్యంలో జేసీల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా థియేటర్లలో తనిఖీలు జరుగుతున్నాయి.
థియేటర్ లైసెన్స్ లు - సినిమా టికెట్ల ధరలు - సేఫ్టీ మెజర్స్ - కోవిడ్ ప్రొటోకాల్స్ - ఇతర సదుపాయాల మీద అధికారులు ఆరాలు తీస్తున్నారు. నిబంధనలు పాటించడం లేదంటూ రాష్ట్ర వ్యాప్తంగా పలు థియేటర్లను సీజ్ చేస్తున్నారు.. మరికొన్ని థియేటర్లకు ఫైన్ వేస్తున్నారు. అయితే లైసెన్స్ లు రెన్యువల్ చేయించుని అన్ని సక్రమంగా ఉన్న థియేటర్ ఓనర్లు మాత్రం.. ప్రభుత్వం నిర్దేశించిన ధరలతో నడపలేమంటూ స్వచ్ఛంధంగా సినిమా హాళ్లను మూసివేస్తున్నారని ప్రచారం జరుగుతోంది.
ప్రభుత్వం నిర్ణయించిన రూ.10 - రూ.15 - రూ.20 టికెట్ల ధరలతో థియేటర్లను నిర్వహించలేమని కొందరు ఎగ్జిబిటర్స్ వాపోతున్నారని తెలుస్తోంది. ఇప్పుడున్న టికెట్ రేట్లతో కనీసం కరెంటు చార్జీలు కూడా వచ్చే అవకాశాలు లేవని.. థియేటర్ రెంట్ - మెయింటెనెన్స్ ఖర్చులు - ట్యాక్సులు వంటివి అదనపు భారంగా మారే పరిస్థితి ఉందని యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా పలు థియేటర్లలో ప్రదర్శన నిలిపేసి.. స్వచ్చందంగా మూసివేసినట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా బీ, సీ సెంటర్స్ లలో చాలా వరకు థియేటర్స్ క్లోజ్ చేసారని అంటున్నారు.
గురువారం తూర్పుగోదావరి జిల్లాలో దాదాపు 50 థియేటర్లను ఈ విధంగానే మూసివేశారని వార్తలు వస్తున్నాయి. కృష్ణ - విజయనగరం - చిత్తూరు.. ఇలా ప్రతి జిల్లాలోనూ థియేటర్లు మూత పడినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న వ్యవహారంతో ఎగ్జిబిషన్ సెక్టార్ పరిస్థితి దారుణంగా మారింది. ఒకవైపు నిబంధనల పేరుతో అధికారులు థియేటర్లను సీజ్ చేస్తుంటే.. మరోవైపు ప్రభుత్వం నిర్ణయించిన రేట్లతో నడపలేమంటూ థియేటర్ యజమానులు స్వచ్ఛంద నిలిపివేయడంతో ఆంధ్రప్రదేశ్ లో ఎగ్జిబిషన్ రంగం కుదేలయ్యే పరిస్థితి వచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
నిజానికి కరోనా పాండమిక్ వల్ల గత రెండేళ్లుగా ఎగ్జిబిటర్స్ తీవ్ర కష్టనష్టాలు చవి చూసారు. ఎప్పుడూ సినిమాలతో కళకళలాడే థియేటర్లు మూతబడి ఉండటంతో.. వాటి మీద ఆధారపడి బ్రతికే కుటుంబాల పరిస్థితి దయనీయంగా మారింది. అయితే కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఇప్పుడిప్పుడే థియేటర్స్ పరిస్థితి సానుకూలంగా మారుతోంది. 'లవ్ స్టొరీ' 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' వంటి సినిమాలు జనాలకు థియేటర్లకు రప్పించగా.. హౌస్ ఫుల్స్ తో 'అఖండ' సినిమా వీరందరికీ ఊపిరి పోసింది. 'పుష్ప' సినిమా కూడా పర్వాలేదనిపించింది.
థియేటర్లు ఫుల్ అవుతుండటంతో ఎగ్జిబిటర్స్ తో పాటుగా దాని మీద ఆధారపడి బతికే పది మంది పరిస్థితి ఇప్పుడిప్పుడే నార్మల్ గా మారుతోంది. రాబోయే రోజుల్లో పెద్ద సినిమాలు విడుదలలు ఉన్నాయి. రేపు 'శ్యామ్ సింగరాయ్' రిలీజ్ అవుతుండగా.. సంక్రాంతి సీజన్ లో 'ఆర్.ఆర్.ఆర్' 'రాధే శ్యామ్' 'బంగార్రాజు' వంటి పెద్ద సినిమాల విడుదలలు ఉన్నాయి. వీటితో ఎగ్జిబిషన్ సెక్టార్ పుంజుకుంటుంది అనుకుంటుండగా.. ఇప్పుడు సినిమా టికెట్ రేట్ల తగ్గింపుతో పరిస్థితి అయోమయంగా మారింది.
గవర్నమెంట్ నిర్దేశించిన ధరలతో థియేటర్లు నడపలేమంటూ క్లోజ్ చేస్తున్నారంటే.. ఎగ్జిబిషన్ రంగం మొత్తం మళ్ళీ పడుకునే పరిస్థితి వచ్చిందనే అనుకోవాలి. ఇదిలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో థియేటర్లన్నీ కల్యాణ మండపాలుగా మార్చుకోవాల్సి వస్తుందేమో అని ఎగ్జిబిటర్స్ ఆవేదన చెందుతున్నారు. ఇదే జరిగితే ఇప్పుడిప్పుడే నార్మల్ అవుతున్న ఇండస్ట్రీ మళ్ళీ గడ్డు పరిస్థితి ఎదుర్కోవలసి ఉంటుంది. ఎగ్జిబిటర్స్ సెక్టార్ బతికి బట్టకట్టాలంటే సినిమా టికెట్ ధరల అంశం మీద ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం రావాలని థియేటర్ యాజమాన్యాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి త్వరలోనే ఈ వ్యవహారం ఓ కొలిక్కి వచ్చి అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయేమో చూడాలి.