ఎఫ్‌3 బ్యూటీ మైండ్‌ బ్లాంక్ చేసే అందం

Update: 2022-05-04 00:30 GMT
నాని హీరోగా నటించిన కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమా తో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ మెహ్రీన్ ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు మరింతగా చేరువ అయ్యింది. ఆమద్య పెళ్లి చేసుకోబోతున్నట్లుగా ప్రకటించి అభిమానులకు షాక్ ఇచ్చిన మెహ్రీన్ కొన్ని కారణాల వల్ల పెళ్లి క్యాన్సిల్ చేసుకుంది. హీరోయిన్ గా ప్రస్తుతం వరుసగా సినిమాల్లో నటించేందుకు సిద్దం అవుతుంది.

త్వరలో ఎఫ్ 3 సినిమా తో వరుణ్ తేజ్ తో కలిసి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఒక కన్నడ సినిమా లో కూడా ఈమె నటించింది. ఆ సినిమా త్వరలోనే విడుదల కాబోతుందట. తెలుగు లో రెండు మూడు సినిమాల చర్చల దశలో ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఒక యంగ్ స్టార్‌ హీరోకు జోడీగా ఈ అమ్మడు నటించేందుకు రెడీ అవుతుంది. ఆ విషయమై త్వరలో అధికారిక ప్రకటన రాబోతుందట.

హీరోయిన్ గా సినిమాలు ఎక్కువగా చేయకున్నా కూడా సోషల్‌ మీడియాలో రెగ్యులర్ గా ఫోటోలు షేర్‌ చేయడం వల్ల వైరల్‌ అవుతూనే ఉంటుంది.

తాజాగా మరోసారి ఆమె తన అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇలా పొట్టి స్కర్ట్‌ ను వేసుకుని థైస్ ను ఎక్స్‌ పోజ్‌ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది. పొడుగు కాళ్ల ఈ సుందరి అందం విషయంలో స్టార్‌ హీరోయిన్స్ కు ఏమాత్రం తగ్గేది లేదు అన్నట్లుగా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి.

మెహ్రీన్‌ తెలుగు లో మహానుభావుడు.. రాజా ది గ్రేట్‌.. జవాన్.. పంథం.. నోటా.. కవచం... ఎఫ్‌ 2.. ఛాణక్య... ఎంత మంచివాడవురా.. అశ్వథామ తో పాటు ఇంకా పలు సినిమాల్లో నటించింది. తెలుగు సినిమాలతో పాటు ఈ అమ్మడు హిందీ.. తమిళం.. కన్నడం మరియు పంజాబీ భాషల సినిమాల్లో కూడా ఈమె నటించింది. పెళ్లి క్యాన్సిల్‌ అవ్వడంతో ఈ అమ్మడు మరికొన్నాళ్ల పాటు హీరోయిన్ గా సినిమాలు చేసే అవకాశాలు ఉన్నాయి.
Tags:    

Similar News