వెండితెర‌పై హీటెక్కిస్తున్న హాట్ ల‌వ్ క‌పుల్!

Update: 2020-09-05 07:15 GMT
మ‌ల‌యాళ యువ‌హీరో ఫ‌హద్ ఫాజిల్ - హీరోయిన్ న‌జ్రియా న‌జీమ్ ప్రేమ వ్య‌వ‌హారం అటుపై పెళ్లి గురించి తెలిసిందే. కెరీర్ పీక్స్ లో ఉండ‌గానే ప్రేమ వ్య‌వ‌హారం వ‌ల్ల న‌జ్రియా సినిమాల‌కు దూర‌మైంది. ఫ‌హ‌ద్ ని పెళ్లాడి ఓ ఇంటిదైంది. ఇక‌ ఈ జంట క‌లిసి ఇటీవ‌లే ట్రాన్స్ అనే మూవీలో న‌టించారు. ఎవ‌రికి వారు అద్భుత న‌ట‌ప్ర‌ద‌ర్శ‌న‌తో క‌ళ్లు చెదిరే ట్రీటిచ్చారంటే అతిశ‌యోక్తి కాదు. ఒక విభిన్న‌మైన కాన్సెప్ట్ ఉన్న ఈ సినిమాలో న‌జ్రియా హాట్ అప్పియ‌రెన్స్ యువ‌త‌రానికి పిచ్చెక్కించింద‌నే చెప్పాలి.

తాజాగా నజ్రియా నజీమ్- ఫ‌హ‌ద్ జంట‌  కొన్ని అందమైన బ్లాక్ అండ్ వైట్ ఫోటోల‌ను ఇన్ ‌స్టాగ్రామ్ లో పంచుకున్నారు. భార్యాభర్తల మోనోక్రోమ్ చిత్రాలు వారి మ‌ధ్య అన్యోన్య‌త‌ ప్రేమకు ప్రూఫ్ అనడంలో సందేహ‌మేం లేదు. వీటిలో ఫహద్ ఫాసిల్ సింపు‌ల్ లుక్ తో కనిపిస్తుండగా.. భార్య నజ్రియా నజీమ్ తన అందంతో స్మైలీ లుక్ తో హృదయాలను దొంగిలిస్తోంది. మంత్రముగ్దులను చేసే ఈ ఫోటో యువ‌త‌రంలో వైర‌ల్ గా మారింది.

ప్ర‌స్తుతం ఫహాద్ ఫాసిల్ `సి యు సూన్` అనే చిత్రంలో నటించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 1 న డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ ‌పై విడుదలైంది. మహేష్ నారాయణన్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఫహద్ ఫాసిల్ తో పాటు నజ్రియా ఈ సినిమాకి టెక్నిక‌ల్ విభాగంలో ప‌ని చేసింద‌ట‌. ఇక తాజా చిత్రంలో ఫ‌హ‌ద్ న‌ట‌ప్ర‌ద‌ర్శ‌న‌కు అభిమానులు చాలా సానుకూలంగా స్పందిస్తున్నారు. ఫహద్  అభిమానులు  అనుచరులు కూడా తమ సోషల్ మీడియాల్లో ఈ థ్రిల్లర్ గురించి తమ అభిప్రాయాల్ని వెల్ల‌డిస్తున్నారు. భార్యాభ‌ర్త‌లు వ‌రుస‌గా సినిమాల‌కు క‌లిసి ప‌ని చేస్తున్నారు. ట్రాన్స్ త‌ర‌హాలో మ‌రిన్ని సినిమాల్లో ఈ జంట న‌టించాల‌ని కూడా అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
Tags:    

Similar News