విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా నటించిన `నారప్ప` ఈనెల 20న అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఎట్టి పరిస్థితుల్లో థియేటర్లోనే రిలీజ్ చేయాలని ఎగ్జిబిటర్లు పట్టుబట్టినప్పటికి నిర్మాత సురేష్ బాబుకు వీలు కాలేదు. నిర్మాతల్లో ఒకరైన కళైపులి ఎస్.థాను అందుకు అంగీకరించలేదు. అయితే అంత పెద్ద సినిమా ఓటీటీ రిలీజ్ పై అభిమానులు కూడా అసంతృప్తిగానే ఉన్నారు. దీంతో నిర్మాతలతో ఎగ్జిబిటర్ల విభేధాలు పెరిగినా కానీ చివరికి ఓటీటీ రిలీజ్ ఆగలేదు.
దీంతో వెంకటేష్ అభిమానులు నిరాశకు గురయ్యారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో థియేటర్లలో తన సినిమా రిలీజ్ చేయలేకపోతున్నామని.. తదుపరి సినిమాలు మాత్రం థియేటర్లోనే రిలీజ్ అయ్యేలా చర్యలు తీసుకుంటామని నచ్చజెప్పే ప్రయత్నం చేసారు. ఇంత వరకూ బాగానే ఉంది. వెంకీ నటించిన మరో సినిమా `దృశ్యం-2` కూడా ఓటీటీలోనే రిలీజ్ అవుతుందని ఎప్పటి నుంచో ప్రచారం ఉంది.
అయితే ఈ సినిమా రిలీజ్ థియేటర్లోనా? ఓటీటీలోనేనా అన్న దానిపై వెంకటేష్ క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పటికే సురేష్ బాబు `దృశ్యం 2`కి కూడా ఓటీటీతోనే రిలీజ్ కు ఒప్పందం చేసుకున్నట్లు ప్రచారం ఉంది. నారప్పను అమెజాన్ ప్రైమ్ భారీ ధరకు కొనుగోలు చేసింది. అందుకే సురేష్ బాబు థియేట్రికల్ రిలీజ్ కు ఆసక్తి చూపించలేదని టాక్ వినిపించింది. మరి `దృశ్యం-2`కి ఇలాంటి సన్నివేశమే రిపీట్ చేస్తారా? లేక వెంకటేష్ మాట నిలబెడతారా? అన్నది చూడాలి.