ప్రియురాలి మోజులో టాలెంటెడ్ హీరో

Update: 2019-04-12 04:46 GMT
బాలీవుడ్ లోనే కాదు సగటు హిందీ సినిమాలు చూసే ప్రతి ఒక్కరికి సుపరిచితమైన పేరు ఫర్హాన్ అక్తర్. దర్శకుడిగా నటుడిగా గాయకుడిగా మ్యూజిక్ డైరెక్టర్ గా ఇలా మల్టీ టాలెంట్స్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఇతగాడు ఇప్పుడు ప్రేమ వలలో చిక్కుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే ఫర్హాన్ అక్తర్ కు ఎప్పుడో పెళ్ళయ్యింది. భార్య పేరు ఆధునా. ఎదుగుతున్న ఇద్దరు ఆడపిల్లలకు ఇతను తండ్రి.

అంతా సవ్యంగా ఉంది అనుకుంటున్న తరుణంలో ఫర్హాన్ తన కో సింగర్ కం లవర్ షిబాని దండేకర్ ప్రేమలో పడిపోయాడు. సరే ఏదో గుట్టుగా వ్యవహారం జరిపితే ఇవన్ని సినిమా పరిశ్రమలో మాములే అనుకోవచ్చు కాని ఇటీవలే ఈ జంట మెక్సికోకు వెళ్ళింది. అక్కడ బీచ్ ఒడ్డున చిన్న కర్చీఫ్ ముక్కల్లాంటి రెండు గుడ్డ పీలికలు చుట్టుకుని ఆడిన సరస సల్లాపాలు సోషల్ మీడియాకు ఫోటోల రూపంలో దొరిపోయాయి. ఇంకేముంది రచ్చ షురు

ఇంట్లో వయసుకోస్తున్న ఇద్దరు ఆడపిల్లలను పెట్టుకుని ఇదేమి పోయేకాలం అంటూ కొందరు దుమ్మెత్తి పోస్తుండగా ఇలా రెండో సెటప్ వ్యవహారాలు మాములే కదా అంటూ ఇంకొందరు వెనకేసుకొస్తున్నారు. ఇది కాస్తా నాన్న జావేద్ అక్తర్ కు సైతం చుట్టుకునేలా ఉంది.  షిబాని వ్యవహారం పట్ల ఫ్యామిలీ మాత్రం సీరియస్ గా ఉన్నట్టు వాళ్ళను కలిసిన మీడియా ప్రతినిధుల ద్వారా తెలిసింది.

మరీ ఇంత పబ్లిక్ గా స్నానాలు చేస్తూ వయ్యారాలు దిగుతూ ఫోటోలు తీసుకోవడం ఏమిటని నిలదీస్తున్నారు. మొదటి భార్య ఆధునాతో ఎలాంటి సమస్య లేనప్పుడు ఇప్పుడీ షిబాని ఎందుకని వాళ్ళ ప్రశ్న. దీనికి సమాధానం చెప్పడం కష్టమే. ఫర్హాన్ మాత్రం ఇవేవి పట్టనట్టు షిబానితో షికార్లు కంటిన్యూ చేస్తున్నాడట

Tags:    

Similar News