శ్రద్ధగా కాపురం పెట్టేస్తోందటగా!!

Update: 2016-11-28 07:30 GMT
ఓ సినిమాలో కలిసి నటిస్తున్నపుడు హీరో హీరోయిన్ల మధ్య ఏదో ఉందని పుకార్లు రావడం కామనే కానీ.. ఆ తర్వాత కూడా ఆ జంటపై ఏదో ఒక వార్త హల్ చల్ చేస్తోందంటే మాత్రం.. కచ్చితంగా వారి మధ్య ఏదో ఉన్నట్లే లెక్క. రాక్ఆన్2లో కలిసి నటించిన శ్రద్ధాకపూర్-ఫరాన్ అక్తర్ లపై ఇప్పుడు అలాంటి వార్తలే షికార్లు చేస్తున్నాయి.

ఫర్హాన్ నాకు బెస్ట్ ఫ్రెండ్ అని శ్రద్ధా కపూర్ చెబుతోంది కానీ.. వారి బిహేవియర్ మాత్రం ఇంకేవేవో ఊహించుకునేందుకు అవకాశం ఇస్తోంది. రాక్ఆన్2 కంటే ముందే వీరి బంధం మొదలైంది. బాఘీ సక్సెస్ అయినపుడు పార్టీ ఇచ్చిన శ్రద్ధ.. ఆ పార్టీలో ఫరాన్ అక్తర్ తో కలిసి శృతి మించి వేసిన చిందులను ఎవరూ మర్చిపోలేదు. రీసెంట్ గా ముంబైలో జరిగిన సిటిజెన్ ఫెస్టివల్ లో కూడా ఫరాన్ తోనే కలిసి కనిపించింది. వీలు చిక్కినపుడల్లా ఇతగాడి ఇంట్లోనే ఉంటోందట శ్రద్ధ.

ఇప్పుడు బాంద్రాలో ఓ ఇల్లు కొనుక్కున్నాడీ హీరో. ఈ ఇంట్లో శ్రద్ధా కపూర్ కూడా ఉండబోతోందని బాలీవుడ్ టాక్. త్వరలో ఫరాన్ నిర్మించబోతున్న సినిమాలో కూడా ఈ భామనే హీరోయిన్ గా తీసుకోవాలని అనుకోవడం వెనక కూడా.. ఈ బంధమే అసలు కారణం అంటున్నారు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News