కార్మిక వేతనాలపై ఫెడరేషన్ ఏళ్ల తరబడి చేస్తున్న పోరాటం ఫలించింది. ఎట్టకేలకు నిర్మాతలు దిగి వచ్చి భత్యం పెంపునకు ఆమోదం తెలిపారు. కార్మిక వేతనముల విధివిధానములు ఖరారయ్యాయని.. తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి 2018 సంవత్సరములో చేసిన ఒప్పందాన్ని అనుసరించి నాటి వేతనాలపై పెద్ద సినిమాలకు 30శాతం.. చిన్న సినిమాలకు 15శాతం పెంచేందుకు అంగీకరించారని ఈ పెంచిన వేతనములు 01 జూలై 2022 వ తేదీనుండి 30 జూన్ 2025 వరకు అమలులో ఉంటాయని అలాగే ఏది చిన్న సినిమా అనేది చలన చిత్ర వాణిజ్య మండలి ..ఎంప్లాయిస్ ఫెడరేషన్ లతో కూడిన కమిటీ నిర్ణయిస్తుందని తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి - తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి సంయుక్త ప్రకటనలో వెల్లడించాయి.
తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి కో-ఆర్డినేషన్ కమిటీ ఛైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. వాణిజ్య మండలి అధ్యక్షులు శ్రీ K. బసిరెడ్డి- గౌరవ కార్యదర్శి శ్రీ K.L. దామోదర్ ప్రసాద్- ప్రొడ్యూసర్స్ సెక్టార్ కౌన్సిల్ చైర్మన్ శ్రీ యేలూరు సురేందర్ రెడ్డి- తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి అధ్యక్షులు శ్రీ. C.కళ్యాణ్- గౌరవ కార్యదర్శి శ్రీ. T. ప్రసన్న కుమార్- తెలంగాణ స్టేట్ చలన చిత్ర వాణిజ్య మండలి గౌరవ కార్యదర్శి శ్రీ కె. అనుపమ్ రెడ్డి ఇతర కమిటీ సభ్యులు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షులు వల్లభనేని అనిల్ కుమార్.. జనరల్ సెక్రటరీ P.S.N. దొర- కోశాధికారి సురేష్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
పెరిగిన ధరల నేపథ్యంలో కుటుంబ జీవనం సమస్యాత్మకంగా మారిందని.. తమ భత్యం పెంచాలని కార్మికులు చాలా ఏళ్లుగా పోరాడుతున్నారు. పలు దఫాలుగా నిర్మాతలతో చర్చలు సాగినా కానీ అవి విఫలమయ్యాయి. కార్మికులు చాలాసార్లు బంద్ కూడా పాటించారు. కానీ సమస్య పరిష్కారం కాలేదు. ఇటీవలే నిర్మాతలే పరిశ్రమ సమస్యల పరిష్కారానికి చొరవ చూపి నెలరోజులు షూటింగులు నిలిపివేసి అన్నివిషయాలపైనా కూలంకుశంగా చర్చించారు. ఎట్టకేలకు కార్మికుల భత్యంపై నిర్మాతలు సానుకూల నిర్ణయం తీసుకోవడంపై హర్షం వ్యక్తమవుతోంది.