మ‌హా నేత‌కు చిత్ర‌ప‌రిశ్ర‌మ‌ల నివాళి

Update: 2018-08-16 14:03 GMT
మాజీ ప్రధాని వాజ్‌ పేయ్ మ‌ర‌ణంపై టాలీవుడ్ - బాలీవుడ్ స‌హా చిత్ర‌ప‌రిశ్ర‌మ‌ల‌న్నీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేశాయి. దేశం ఓ గొప్ప నాయ‌కుడిని భార‌త‌దేశం కోల్పోయింద‌న్న విచారం క‌న‌బ‌రిచారు. గురువారం మ‌ధ్యాహ్నానికే వాజ్‌ పేయి మ‌ర‌ణించార‌న్న వార్త‌తో చిత్ర‌ప‌రిశ్ర‌మ ప్ర‌ముఖులు విచారం వ్య‌క్తం చేసి - ఆయ‌న ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని కోరారు.

మహోన్నత నేతను కోల్పోయామ‌ని నందమూరి బాలకృష్ణ విచారం వ్య‌క్తం చేశారు. మా బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్‌ను జూన్ 22 - 2000 సంవత్సరంలో ఇనాగ్యురేట్ చేసిన మహానుభావుడు వాజపేయి గారు. నాన్నగారితో ఆయనకి మంచి అనుబంధం ఉండేది. ఎన్డీయే ప్రభుత్వంతో కలిసి తెలుగుదేశం పార్టీ క్రియాశీలకంగా పనిచేశారు. ఆయన మంచి వ్యక్తి, భావుకత పుష్కలంగా ఉన్న కవి కూడా. ప్రధానిగా సేవలందిస్తూ ఎన్నో విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకొన్న సమర్ధుడు ఆయన. ఆయన విధివిధానాలు పలువురికి పారదర్శకంగా నిలిచాయి.  అంతటి మహోన్నత రాజకీయ నాయకుడిని కోల్పోవడం బాధాకరమే కాదు, జాతీయ స్థాయి రాజకీయాలకు తీరని లోటు.

నిస్వార్ధ నాయకుడు వాజ్‌పేయి నిష్కృమ‌ణం తీర‌ని లోటు అని డా.ఎం.మోహన్ బాబు అన్నారు. వాజపేయిగారితో మూడుసార్లు వేదిక పంచుకొనే అవకాశం దొరికింది. నా మాటలను మెచ్చుకొనేవారు ఆయన. నేను, విద్యాసాగర్ రావు గారు, వాజపేయిగారు కలిసి పనిచేసాం. ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నేను రాజ్యసభ సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తించాను. రాజకీయాల్లో వాజపేయి లాంటి మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషులు చాలా అరుదు. ఆయన నిస్వార్ధపరుడైన రాజకీయ నాయకుడు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని శిరిడి సాయినాధుని కోరుకొంటున్నాను... అని అన్నారు. నటి ఈషా రెబ్బ సామాజిక మాధ్య‌మాల్లో వాజ్‌ పేయ్ కి సంబంధించిన ఒక వీడియోని షేర్ చేస్తూ.. గొప్ప వ్యక్తి, ఉత్తమ ప్రధానమంత్రి ఇక లేరని తెలిసి బాధలో మునిగిపోయాను. ఆయన ఆత్మకు శాంతి కలగాలి.. అంటూ ట్వీట్ చేశారు. అలానే యాంకర్ కం న‌టి రష్మీ ఆయనకు నివాళులు అర్పించారు.
Tags:    

Similar News