ఎట్ట‌కేల‌కు టికెట్ ధ‌ర‌ల‌పై తుది నివేదిక‌

Update: 2022-02-09 16:30 GMT
టికెట్ లొల్లు తీరేదెలా? అంటూ చాలా కాలంగా టాలీవుడ్ ప్ర‌ముఖులు ఎదురు చూస్తున్నారు. క‌మిటీలు ఏదీ తేల్చ‌క‌పోవ‌డం కోర్టుల‌తో ప‌న‌వ్వ‌క‌పోవ‌డంపై చాలా నిరాశ‌గా ఉన్నారు. అయితే ఇక ఈ నిరాశ‌ను పార‌ద్రోలే స‌మ‌యం వ‌చ్చింది. ఎట్ట‌కేల‌కు క‌మిటీ తుది నివేదిక‌ను స‌మర్పించింద‌ని తెలిసింది.

సినిమా టికెట్ల ధరలపై ప్రభుత్వానికి క‌మిటీ నివేదిక సమర్పించింది. ఈ నివేదిక ప్ర‌కారం.. థియేటర్లలో కనీస ధర రూ.40.. గరిష్ఠ ధర రూ.150గా ఉండాలని ఏపీ ప్రభుత్వానికి  సిఫార్సు చేసింద‌ని స‌మాచారం.

ఎయిర్ కూల్‌ థియేటర్లకు కనీస ధర రూ.40 కాగా.. గరిష్ఠ ధర రూ.120గా ఉండాలని కమిటీ సూచించింద‌ని స‌మాచారం. నాన్‌ ఏసీ థియేటర్లలో కనీస ధర రూ.30 కాగా.. గరిష్ఠ ధర రూ.70గా ఉండాలని కమిటీ తేల్చింది. కమిటీ నివేదికపై రేపు సినీ ప్రముఖులతో సీఎం చర్చించే అవకాశం ఉంద‌ని స‌మాచారం.

సినిమా టికెట్ ధరలపై రేపు హైకోర్టు డివిజనల్‌ బెంచ్‌ విచారణ జ‌ర‌గ‌నుంది. ఇప్పటికే మూడుసార్లు సమావేశమై టికెట్‌ ధరలపై క‌మిటీ చర్చించింది. అంతిమంగా ఒక నిర్ణ‌యానికి వ‌చ్చింది.
Tags:    

Similar News