బిగ్‌ బి తో ఫస్ట్‌ డే ఎక్స్‌ పీరియన్స్‌

Update: 2021-08-07 11:33 GMT
టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్ రష్మిక మందన్న ప్రస్తుతం బాలీవుడ్‌ లో వరుసగా సినిమాలు చేస్తోంది. అక్కడ రెండు సినిమాల్లో నటిస్తున్న రష్మిక ఒక సినిమాలో అమితాబచ్చన్ తో కలిసి స్క్రీన్‌ షేర్ చేసుకోబోతుంది. గుడ్ బై సినిమా లో అమితాబచ్చన్‌ తో పాటు రష్మిక నటిస్తుంది. క్వీన్‌.. సూపర్ 30 వంటి విభిన్న చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు వికాస్‌ ప్రస్తుతం అమితాబ్‌ మరియు రష్మికలతో గుడ్‌ బై సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్‌ సందర్బంగా అమితాబచ్చన్‌ తో రష్మిక తన మొదటి రోజు ఎక్స్‌ పీరియన్స్ ను సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేసుకుంది. బిగ్‌ బి అమితాబ్ తో నటించడం అంటే ఎవరికైనా ఛాలెంజింగ్‌ విషయం. ఆయన పక్కన నిల్చుని ఫొటో దిగడమే చాలా గొప్ప విషయం. అలాంటిది ఆయనతో నటించే అవకాశం రావడంతో ఆనందంతో ఏం చేయాలో మర్చి పోయేవారు చాలా మంది ఉంటారు.

రష్మిక గుడ్‌ బై సినిమా షూటింగ్ లో తన సోలో పోర్షన్‌ ను ముగించిన తర్వాత అమితాబచ్చన్‌ తో సన్నివేశాలు చేయాల్సిన సమయం వచ్చిందట. ముందు రోజు షూటింగ్‌ అయిపోయిన తర్వాత అలాగే ఉండి దర్శకుడు వికాస్ తో రేపటి సన్నివేశాల గురించి మరోసారి ఎక్స్‌ ప్లైన్‌ చేయించుకుని వాటిని అమితాబచ్చన్‌ గారితో ఎలా చేయాలా అనేది చర్చించి మరీ ప్రాక్టీస్‌ చేసిందట. దర్శకుడు చెప్పిన.. సూచించిన పలు విషయాలను దృష్టిలో పెట్టుకుని తదుపరి రోజు అయిన ఫస్ట్‌ డే షూట్‌ లో రష్మిక పాల్గొన్నదట. ఆ సమయంలో బిగ్‌ బి చాలా కూల్‌ గా సింపుల్‌ గా నటించేశారట.

ఆయనతో నటిస్తున్న సమయంలో పూర్తిగా పాత్రలో లీనం అవ్వడం వల్ల ఆయనతో కాకుండా పాత్రలు రెండు నటిస్తున్నట్లుగా అనిపించింది. అంతకు మించి ఆయన నుండి ఎలాంటి ఆందోళన రాకు ఎదురు కాలేదని.. ఆయనతో నటించడంను జీవితాంతం మర్చిపోలేని విషయం అన్నట్లుగా రష్మిక చెప్పుకొచ్చింది. అమితాబచ్చన్‌ వంటి లెజెండ్‌ తో నటించడం.. అది కూడా ఆయనతో పోటీ పడి నటించడం అంటే మామూలు విషయం కాదు. ఆయకు సంబంధించినంత వరకు పాత్రను పాత్రల చూస్తూ నటిస్తారు. కనుక ఆయనతో నటించడం కష్టం ఏమీ కాదు అంటూ కొందరు చెబుతూ ఉంటారు. ఇప్పుడు రష్మిక కూడా అదే విషయాన్ని చెప్పుకొచ్చింది.
Tags:    

Similar News