ఫ‌స్ట్ లుక్ సోలో బ్ర‌తుకే సో బెట‌ర్

Update: 2019-10-07 14:30 GMT
మోడ్ర‌న్ లైఫ్ లో సోలో లైఫ్ లీడ్ చేసే యూత్ ఎక్కువ‌గానే క‌నిపిస్తోంది. కెరీర్ స‌క్సెస్ కోసమో.. ప్రేమ‌లో వైఫ‌ల్యం వ‌ల్ల‌నో.. లేక ఇంకేదైనా కార‌ణం వ‌ల్ల‌నో మొత్తానికి సోలోగా కాలాన్ని ముందుకు జ‌రిపేస్తూ బ‌తికేసే యూత్ ఎక్కువైంది.

మొత్తానికి బ్ర‌హ్మ‌చారి సోలో బ్ర‌తుకే సో బెట‌ర్! అంటూ సింగిల్ లైఫ్ ప‌ర‌మార్థాన్ని సుప్రీం హీరో సాయిధ‌ర‌మ్ వ‌ర్ణించి చెప్ప‌బోతున్నాడ‌ని తాజాగా రివీల్ చేసిన‌ పోస్ట‌ర్ చెబుతోంది. తాజాగా అత‌డు న‌టిస్తున్న చిత్రానికి సోలో బ్ర‌తుకే సో బెట‌ర్ అనే టైటిల్ ని ఫిక్స్ చేస్తూ పోస్ట‌ర్ ని రిలీజ్ చేయ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఈ పోస్ట‌ర్ లో 108 శ్లోకాలు అంటూ బ్యాచిల‌ర్ జీవితంలోని ఫిలాస‌ఫీని రివీల్ చేయ‌బోతున్నార‌ని అర్థ‌మ‌వుతోంది. కెరీర్ లో సెటిల్ కాలేక స్ట్ర‌గుల్ అయ్యే కుర్రాడిగా చిత్ర‌ల‌హ‌రిలో అద్భుతంగా న‌టించి మెప్పించిన సాయిధ‌ర‌మ్ .. ఆ సినిమాలో ప్రేమ‌.. కెరీర్ స్ట్ర‌గుల్ క‌నిపించింది. ఇప్పుడు ఏకంగా సోలో బ్ర‌తుకే సో బెట‌ర్! అంటూ పూర్తిగా సింగిల్ లైఫ్ ప‌ర్య‌వ‌సానంపై క్లారిటీగా బ‌రిలో దిగిపోతున్నాడు.

ఈ చిత్రంతో సుబ్బు అనే కొత్త కుర్రాడు ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీచిత్ర ప‌తాకంపై బీవీఎస్.ఎన్ ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్.థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు.
సాయిధ‌ర‌మ్ న‌టిస్తున్న ప్ర‌తి రోజు పండ‌గే చిత్రం ఆన్ సెట్స్ ఉన్న సంగ‌తి తెలిసిందే. మారుతి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు
Tags:    

Similar News