త్రివిక్ర‌మ్ చెప్పిందే ఫాలో అయ్యార‌ట‌

Update: 2022-02-11 06:43 GMT
ద‌క్క‌న్ సినిమాలు ఒక ద‌శ‌లో పాపుల‌ర్ కావ‌డ‌మే కాకుండా మంచి క్రేజ్‌ని సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు అదే పంథాని అనుస‌రించి సిద్ధూ జొన్న‌ల‌గ‌డ్డ చేసిన చిత్రం `డీజే టిల్లు`. విమ‌ల్ కృష్ణ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్న ఈ చిత్రాన్ని సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మించారు. భారీ క్రేజ్ ని సొంతం చేసుకున్న ఈ మూవీ రేపే (ఈ నెల 12న)  ప్రేక్ష‌కుల ముందుకొస్తోంది. ఈ సంద‌ర్భంగా హీరో సిద్ధూ జొన్న‌ల గ‌డ్డ ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల్ని వెల్ల‌డించారు.

చిన్న చిత్రంగా మొద‌లైన ఈ మూవీ ప్ర‌స్తుతం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఈ మూవీ స్క్రిప్ట్ ని ముందు మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ కి వినిపించార‌ట‌. క‌థ విన్న త్రివిక్ర‌మ్ కొన్ని ఐడియాల‌తో పాటు కొన్ని సూచ‌న‌లు చేశార‌ట‌. అంతే కాకుండా ఈ మూవీని ఓన్ స్టైల్లోనే తీయ‌మ‌ని సూచించార‌ట‌. ఆయ‌న చెప్పిందే ఫాలో అయ్యామ‌ని సిద్దూ జొన్న‌ల‌గ‌డ్డ‌.  

సినిమా విష‌యానికి వ‌స్తే మెచ్యూర్ లేదా బ్యాలెన్సింగ్ అనేది నాకు ఆస‌క్తిక‌రంగా అనిపించ‌దు. హీరో పాత్ర‌కు ఎటువంటి స‌మ‌స్య‌లు లేకుంటే అలాంటి క‌థ‌పై ప్రేక్ష‌కులు ఆస‌క్తి చూప‌రు.  అందుకే టిల్లు క్యారెక్ట‌ర్ ని లోప‌భూయిష్టంగా తీర్చి దిద్దాన‌న్నారు. అంతే కాకుండా త‌ను రాసిన క‌థ‌ల‌ని సొంత అనుభ‌వాల నుంచి స్ఫూర్తి పొంది రాసుకున్నాన‌ని చెప్పుకొచ్చాడు. అయితే త‌న‌కు ర‌చ‌యిత‌గా వుండ‌టం కంటే న‌టుడిగా వుండానికే అధికంగా ఇష్ట‌ప‌డ‌తాన‌ని, న‌ట‌న‌కే త‌న తొలి ప్రాధాన్య‌త అని తెలిపాడు సిద్దూ.

ఇక సంగీతం పై త‌న‌కున్న ప‌ట్టుగురించి మాట్లాడుతూ ` నాలుగేళ్లు త‌బ‌లా నేర్చుకున్నాన‌ని, అందు వ‌ల్లే త‌న‌కు సంగీతంపై ప‌ట్టు ఏర్ప‌డింద‌ని చెప్పుకొచ్చాడు. `డీజే టిల్లు` ప్రోమోలు చూస్తే యూత్ ని టార్గెట్ చేసిన‌ట్టుగా వున్నాయి. కానీ సినిమా మాత్రం పూర్తి వినోదాత్మ‌క చిత్రం. ఇంటిల్లిపాద‌కి న‌చ్చుతుంది. ప్ర‌తి సినిమాకు టార్గెట్ ఆడియ‌న్స్ అంటూ వుంటారు. ప్ర‌తీ చిత్రాన్ని అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కులు చూస్తార‌ని చెప్ప‌లేం. టార్గెట్ చేసిన ఆడియ‌న్స్ సినిమా చూస్తే చాలు హిట్ అవుతుంది. మా టార్గెట్ యూత్‌. కామెడీ థ్రిల్ల‌ర్ ల‌ని ఇష్ట‌ప‌డే ప్రేక్ష‌కుల‌కు త‌ప్ప‌కుండా న‌చ్చే చిత్ర‌మిదన్నారు సిద్ధూ.

ఇక సినిమా ర‌న్ టైమ్ గురించి వివ‌రిస్తూ ` ఈ మూవీ ర‌న్ టైమ్  2 గంట‌ల 4 నిమిషాలు. అయితే దాదాపు గంట నిడివిని ఎడిటింగ్ లో తొల‌గించాం. ఆ స‌న్నివేశాల‌ని సినిమా రిలీజ్ త‌రువాత పార్ట్ లు పార్ట్ లుగా విడుద‌ల చేస్తాం. త్రివిక్ర‌మ్ సితార ఎంట‌ర్ టైన్‌మెంట్స్, హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ లో చేయ‌బోయే సినిమాల స్క్రిప్ట్ ల‌ను విన‌డం, అవ‌స‌ర‌మైతే త‌న విలువైన ఇన్ పుట్ ల‌ని అందించ‌డం అనేది ఆన‌వాయితీ. అదే ఈ చిత్రానికి కూడా జ‌రిగింది. ఆయన‌ ఇచ్చిన స‌ల‌హాలు, సూచ‌న‌లని ఫాలో అయ్యాం` అని తెలిపాడు హీరో సిద్దూ జొన్న‌ల‌గ‌డ్డ‌.
Tags:    

Similar News