నిఖిల్- స్వాతి హీరో హీరోయిన్లుగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన 'కార్తికేయ' 2014 లో విడుదలై సంచలన విజయం సాధించింది. ఇప్పుడు అ సినిమాకు సీక్వెల్ గా 'కార్తికేయ 2' కు రంగం సిద్ధమవుతోంది. కొద్ది రోజుల క్రితమే ఈ సినిమాను లాంచ్ చేశారు. ఈ సినిమా కాన్సెప్ట్ టీజర్ కూడా ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తించింది. ఈమధ్యే దర్శకుడు చందూ సినిమా కథకు తగ్గ లొకేషన్స్ వేటలో ఉన్నాడని కూడా అప్డేట్ వచ్చింది.
ఈ సీక్వెల్ లో హీరోయిన్ స్వాతి నటిస్తోందని ఈమధ్యే ఒక ఇంటర్వ్యూలో హీరో నిఖిల్ వెల్లడించాడు. మొదటి భాగంలో స్వాతి పాత్రకు ఈ సీక్వెల్ లో కొనసాగింపు ఉంటుందట. ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా ఉంటుందని.. ప్రస్తుతం ఆ సెకండ్ హీరోయిన్ కోసం సెర్చ్ చేస్తున్నారట. అంటే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారు. మరి స్వాతి పాత్ర జస్ట్ క్యామియో తరహ లో ఉంటుందా లేక మెయిన్ హీరోయిన్ లాగా ఉంటుందా అనేది తెలియాల్సి ఉంది.
'కార్తికేయ 2' ను ఈ ఏడాది దసరా సీజన్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ.. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.