ఇలా అయితే.. గేమ్ ఛేంజర్ ఎప్పుడు పూర్తయ్యేనో..?

Update: 2023-04-21 06:00 GMT
అగ్ర దర్శకుడు శంకర్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో భారీ అంచనాలతో గేమ్ ఛేంజర్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఎప్పటి నుండో ఈ మూవీ షూటింగ్ సాగుతూనే ఉంది. పలు కారణాల వల్ల మధ్యలో పలు సార్లు వాయిదా పడింది. కమల్ హాసన్ ఇండియన్ 2 కోసం ఒకసారి ఇంకా పలుసార్లు షూటింగ్ ఆపారు.

గేమ్ ఛేంజర్ మూవీ మేకర్స్ నుండి తాజాగా వచ్చిన అప్డేట్ తో అటు రామ్ చరణ్ ఫ్యాన్స్ తో ఇటు సినీ ప్రేక్షకులు డీలా పడిపోయారు. అదేంటంటే.. గేమ్ ఛేందర్ మూవీ ఇంకా 60 రోజుల షూటింగ్ షెడ్యూల్ బాకీ ఉందట. అంటే దాదాపు 2 నెలల పాటు నిరంతరాయంగా షూటింగ్ చేయాల్సి ఉందని మేకర్స్ అంటున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

2 నెలలే కదా అని అనుకోవచ్చు. కానీ ఈ మధ్య రామ్ చరణ్ భార్య ఉపాసన గర్భం దాల్చిన విషయం తెలిసిందే. పెళ్లైన చాలా కాలం తర్వాత ఉపాసన ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. ఈ సమయంలో తనతో ఉండాలని చెర్రీ భావిస్తున్నాడట. సినిమా షూటింగ్ ల నుండి 2, 3 నెలలు బ్రేక్ తీసుకుని ఉపాసనను జాగ్రత్తగా చూసుకోవాలని కోరుకుంటున్నట్లు సమాచారం.

ఒకవేళ అనుకున్నట్లుగానే రామ్ చరణ్ రెండు మూడు నెలలు బ్రేక్ తీసుకుంటే.. గేమ్ ఛేంజర్ బ్యాలెన్స్ 60 రోజుల షూటింగ్ కంప్లీట్ అయ్యేది ఎప్పుడన్న ప్రశ్నల సినీ ప్రేక్షకులను తొలిచేస్తోంది. షూటింగ్ షెడ్యూల్ పూర్తయితే కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేయలేని పరిస్థితి. ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఇంకెంత సమయం పడుతుందోనని అభిమానులు డౌట్ పడుతున్నారు.

అయితే ఈ సినిమాలో శంకర్.. రామ్ చరణ్ తో డ్యూయల్ రోల్ చేయిస్తున్నారు. అందులో ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే రోల్ లో ఆయన ముఖ్యమంత్రిగా కనిపించనున్నారు. అభ్యుదయం పార్టీ సీఎం క్యాండిడెటే గా చరణ్ నటించబోతున్నారు. ఈ చిత్రంలో అంజలి, కియారా అడ్వాణీలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే తెలుగు అమ్మాయి అంజలి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లో రామ్ చరణ్ భార్యగా కనిపించనున్నారు. హీరో శ్రీకాంత్ ముఖ్యమంత్రిగా నటిస్తున్నారు.

Similar News