వీకెండ్‌ లో గంగవ్వ బయటకు రాబోతుందా?

Update: 2020-09-18 15:30 GMT
తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 4 లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన గంగవ్వ ప్రేక్షకులను ఎంటర్‌ టైన్‌ అయితే చేస్తోంది. అయితే పల్లెటూరు వాతావరణంకు చెందిన గంగవ్వ అక్కడ ఉండలేక పోతుంది. నిన్నటి ఎపిసోడ్‌ లో ఆమె కన్నీరు పెట్టుకోవడం అందరిని కలచి వేసింది. గంగవ్వకు బిగ్‌ బాస్‌ ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్లి పోవచ్చు అనే ప్రత్యేకమైన అవకాశం ఇచ్చి ఉంటాడు. అందుకే గంగవ్వ వెళ్లాలని అనుకుంటుంది. మొదటి వీకెండ్‌ కే నాగార్జునతో కష్టంగా ఉందంటూ గంగవ్వ చెప్పడంతో ఇంకా అలవాటు కాలేదేమో అనుకున్నారు. నిన్నటి ఎపిసోడ్‌ లో ఆమె చాలా ఇబ్బంది పడుతున్నట్లుగా తేలిపోయింది. అందుకే షో నిర్వాహకులు కూడా ఆమెను పంపించేందుకు నిర్ణయించుకున్నట్లుగా మీడియా సర్కిల్స్‌ లో ప్రచారం జరుగుతోంది.

గంగవ్వకు ఇప్పటికే వైధ్య పరీక్షలు నిర్వహించిన బిగ్‌ బాస్‌ టీం ఆమెకు అంతా బాగానే ఉందని నిర్థారణకు వచ్చారట. కాని ఆమె ఈ వాతావరణంలో ఉండలేక పోతుందని అందుకే ఆమె సిక్‌ అయినట్లుగా భావిస్తున్నారట. అందుకే శని లేదా ఆదివారం ఎపిసోడ్‌ లో గంగవ్వను ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా ఆమెతో నాగార్జున మరోసారి మాట్లాడి అయినా వెళ్తాను అంటే అప్పుడు పంపించాలని భావిస్తున్నట్లుగా మీడియా సర్కిల్స్‌ ద్వారా తెలుస్తోంది.

గంగవ్వ ఉంటే సందడి ఉంటుంది.. కాని ఆమెను బలవంతంగా ఉంచేందుకు ప్రయత్నిస్తే ప్రేక్షకుల నుండి విమర్శలు వచ్చే అవకాశం ఉంది. అందుకే గంగవ్వను ఇబ్బంది పెట్ట కుండా పంపించేందుకే బిగ్‌ బాస్‌ టీం సుముఖంగా ఉన్నట్లుగా స్టార్‌ మా వర్గాల నుండి కూడా సమాచారం అందుతోంది. గంగవ్వ ఉండాలనుకుంటే ప్రేక్షకులు ఆమెను కనీసం ఏడు నుండి పది వారాలు అయినా ఈజీగా ఉంచుతారు. కాని ఆమెకు ఇక్కడి వాతావరణం పడని కారణంగా ఆమె వెళ్లి పోవడమే ఉత్తమం అన్నట్లుగా ప్రేక్షకులు కూడా భావిస్తున్నారు.
Tags:    

Similar News