భీమ్లా నాయక్‌ రాకుంటే గంగూ భాయ్ కుమ్మేయడం ఖాయం

Update: 2022-02-08 23:30 GMT
పవన్‌ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్‌ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. ఈ సినిమా కు రెండు విడుదల తేదీలను ఖరారు చేయడం జరిగింది. ఆ రెండు విడుదల తేదీల్లో ఫిబ్రవరి 25వ తారీకు ఒకటి అనే విషయం తెల్సిందే. అదే తేదీకి బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్ ఆలియా భట్ నటించిన గంగూ భాయ్ సినిమా విడుదల కాబోతుంది.  కేవలం హిందీలోనే కాకుండా సౌత్‌ లో అన్ని భాషల్లో కూడా భారీగా గంగూ భాయ్ సినిమాను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవలే విడుదల అయిన గంగూ భాయ్ ట్రైలర్ కు అనూహ్య రెస్పాన్స్‌ వచ్చింది. బాలీవుడ్‌ నుండి చాలా నెలల తర్వాత రాబోతున్న అతి పెద్ద సినిమా అవ్వడంతో అక్కడ ఇక్కడ అన్ని చోట్ల కూడా విపరీతమైన బజ్ క్రియేట్‌ అయ్యింది. అందుకే భీమ్లా నాయక్‌ సినిమా కనుక ఫిబ్రవరి 25 వ తారీకున తెలుగు ప్రేక్షకుల ముందుకు రాకుంటే ఆలియా వసూళ్ల విషయంలో కుమ్మేయడం ఖాయం అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

భీమ్లా నాయక్‌ సినిమా విడుదల వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని ఇన్నాళ్లు భావించారు. కాని ఏపీలో పరిస్థితులతో పట్టింపు లేకుండానే భీమ్లా నాయక్ సినిమాను విడుదల చేయాలనే నిర్ణయానికి మేకర్స్‌ వచ్చారని.. ఫిబ్రవరి 25నే సినిమా విడుదల కాబోతున్నట్లుగా తెలుస్తోంది. దాంతో గంగూభాయ్ కి కాస్త కష్టమే అన్నట్లుగా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. గంగూ భాయ్ తెలుగు ట్రైలర్‌ కు విశేష స్పందన వచ్చింది. ఇటీవల కాలంలో విడుదల అయిన డీజే టిల్లు మరియు గంగూ భాయ్ ట్రైలర్ లు ఏ రేంజ్ లో యూట్యూబ్‌ లో ట్రెండ్ అవుతున్నాయో ప్రతి ఒక్కరు చూస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా ఈ సినిమా ఆలియా భట్ స్థాయిని మరింతగా పెంచే విధంగా ఉంటుందని మేకర్స్ అంటున్నారు.

సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ సినిమాలో ఆలియా భట్‌ తో పాటు కీలక పాత్రలో అజయ్ దేవగన్ కనిపించబోతున్నాడు. ఆలియా భట్ ఒక వేశ్య పాత్రలో కనిపించింది. వేశ్య అయిన ఆలియా భట్‌ ఆ వృత్తిలో ఉన్న వారిని బయటకు తీసుకు వచ్చేందుకు రాజకీయాల్లో అడుగు పెడుతుంది. పీరియాడిక్‌ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో ఆలియా భట్‌ లుక్‌ కు మంచి ప్రశంసలు దక్కాయి. ఆలియా రెండు విభిన్నమైన యాంగిల్స్ ఉన్న పాత్రను చేసింది. గంగూ భాయ్‌ పాత్ర ఖచ్చితంగా ఆయలియా భట్‌ కెరీర్‌ లో నిలిచి పోవడం మాత్రమే కాకుండా జాతీయ అవార్డును కూడా తెచ్చి పెడుతుంది అంటూ అభిమానులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఆలియా భట్‌ తెలుగు లో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ సినిమాలో కూడా నటించింది. ఆ సినిమాలో ఈమె పాత్ర అత్యంత కీలకమైనదిగా చెబుతున్నారు.

 రూపుదిద్దుకుంటే వైసీపీకి అసలైన అగ్ని పరీక్ష తప్పదని కూడా అంటున్నారు. మరి వైసీపీ బాబుకు బలాన్నిచ్చేలా విపక్షాన్ని మొత్తం ఆయన వద్దకు పంపి ఏం చేయాలనుకుంటోంది అన్నదే ప్రశ్న. చూడాలి మరి ఏ ఎత్తుగడలతో ఏ వ్యాఖ్యానాలు చేస్తున్నారో.
Tags:    

Similar News