11 ఏళ్ళ తరువాత మెసేజ్ వచ్చింది

Update: 2017-07-13 04:11 GMT
ప్రస్థానం సినిమాతో తెలుగు ప్రేక్షకుల దృష్టిలో పడి వెంకటాద్రి ఎక్స్ ప్రెస్  తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సందీప్ కిషన్. మొదలుపెట్టినప్పటి నుండి వరుసుగా సినిమాలు తీస్తున్నా.. ఏవీ తనకు సరైన హిట్ ఇవ్వలేకపోయాయి. ఇప్పుడు రాబోతున్న సినిమాలలో సందీప్ ఎంచుకున్న పాత్రలు కానీ తను పని చేస్తున్న సినిమాలు కానీ అన్నీ కొత్తగా ఉన్నాయి. కృష్ణవంశీ డైరక్షన్లో వస్తున్న నక్షత్రం కూడా విడుదలకు సిద్దంగా ఉంది. సందీప్ తెలుగు సినిమాలు తోపాటుగా తమిళ సినిమాల్లో కూడా చేస్తున్నాడులే.

సోలో హీరోగా చేస్తూనే ముల్టీ స్టార్ సినిమాలు, చిన్న సినిమాలు ఇలా అన్నింటిని చేస్తూ తన గుర్తింపు కోసం ఆరాటపడుతున్నాడు. ‘శమంతకమణి’ సినిమా కూడా ఈ వారం విడుదలకాబోతుంది. అయితే సందీప్ తన కెరియర్ని ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గా మొదలుపెట్టాడు. గౌతమ్ మీనన్ దగ్గర కొన్ని సినిమాలకు అసిస్టెంట్ గా పనిచేసి.. తరువాత హీరో అయిపోయాడు. ఇప్పుడు తన గురువు నుండి నటనను మెచ్చుకొంటూ ఒక ఆత్మీయ సందేశం వచ్చింది. ‘నగరం’ సినిమాలో సందీప్ నటనను చూసి గౌతమ్ మీనన్ ఒక మెసేజ్ పంపాడట. తన గురువు దగ్గర నుండి 11 ఏళ్ళు తరువాత ఇలాంటి ప్రశంస రావడం నాకు చాల సంతోషంగా ఉందంటున్నాడు సందీప్. ఈ పదకొండేళ్లూ మరి ఆయనకు మనోడు నటుడిగానే అనిపించలేదా? లేకపోతే ఆయనకు ఇక హీరోలు ఎవ్వరూ లేక ఇలా సందీప్ ను లైన్లో పెడుతున్నాడా?

సందీప్ కిషన్ నటించిన ‘శమంతకమణి’ సినిమా ఈ శుక్రవారం విడుదలకాబోతుంది. దీనిలో కూడా మనోడు కొత్త గెటప్ తో కనిపించబోతున్నాడు.  శమంతకమణి సినిమాలో ఇతనితో పాటుగా సుధీర్ బాబు - ఆది సాయికుమార్ - నారా రోహిత్ కూడా నటిస్తున్నారు. డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య డైరెక్ట్ చేసిన ఈ సినిమా కూడా తన కెరియర్లో మంచి గుర్తింపుని తెస్తుంది అని నమ్మకంగా చెబుతున్నాడు ఈ కుర్ర హీరో.
Tags:    

Similar News