బాలకృష్ణ తొడగొట్టి మీసం మెలేస్తే... బాక్సాఫీసు దద్దరిల్లిపోతుంది. అలాంటిది, కత్తి పట్టుకుని గుర్రమెక్కితే ఆ క్రేజ్ మామూలుగా ఉండదు. గౌతమీపుత్ర శాతకర్ణి విషయంలో జరుగుతున్నది ఇదే. ఈ సినిమా మొదలైన దగ్గర నుంచే అంచనాలు పెరిగిపోయాయి. ఈ మధ్యనే విడుదలైన ట్రైలర్ కూడా బాలయ్య అభిమానులను విశేషంగా అలరిస్తోంది. చారిత్రక నేపథ్యంలో రాబోతున్న ఈ చిత్రంలో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయని ఆశిస్తున్నారు. అత్యుత్తమ స్థాయి గ్రాఫిక్స్ ఇందులో ఉంటాయని భావిస్తున్నారు. ఆ అంచనాలను ట్రైలర్ రెండింతలు చేసిందని చెప్పాలి.
బాలయ్య కెరీర్ లోనే అత్యంత క్రేజీ చిత్రంగా రూపొందుతున్న గౌతమీపుత్ర శాతకర్ణి సంక్రాంతి బరిలోకి రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే, విడుదలకు ముందే భారీ బిజినెస్ చేసేశాడు బాలయ్య. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రం దాదాపు రూ. 70 నుంచి 80 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందని తెలుస్తోంది. ఏరియాల వారీగా ఈ పంపణీ హక్కులు భారీ మొత్తానికి విక్రయించారు. ప్రాంతాల వారీగా గౌతమీపుత్ర డిస్ట్రిబ్యూటర్ల వివరాలు...
నైజాం - సుధాకర్ రెడ్డి - శ్రేష్ట్ మూవీస్
తూర్పు గోదావరి - సాయి కొర్రపాటి - సురేష్ బాబు - వారాహీ చలన చిత్రం - సురేష్ మూవీస్
పశ్చిమ గోదావరి - మహాలక్ష్మీ ఫిల్మ్స్ (ఎల్.వి.ఆర్.)
కృష్ణా - అలంకార్ ప్రసాద్
గుంటూరు - సుధాకర్
నెల్లూరు - భరత్
సీడెడ్ - సాయి కొర్రపాటి - వారాహీ చలన చిత్రం
ఓవర్ సీస్ - 9 పి.ఎమ్. ఎంటర్టెయిన్మెంట్
వైజాగ్ - సాయి కొర్రపాటి