ఆ మూవీ మ‌హేశ్ చేసుంటే సామ్ లైఫ్ మ‌రోలా ఉండేదా?

Update: 2022-09-19 07:02 GMT
సమంత అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. నటిగా ఎన్నో అవార్డులు, రివార్డులు సొంతం చేసుకొని కెరీర్ పరంగా సూపర్ సక్సెస్ అయిన సమంత.. పర్సనల్ లైఫ్ లో మాత్రం ఓడిపోయింది. ఆమె వ్యక్తిగత జీవితం గురించి అందరికీ తెలిసిందే. యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య ను ప్రేమించి పెళ్లి  చేసుకున్న సమంత.. అతడితో ఎక్కువ కాలం కలిసి ఉండలేక పోయింది. పెళ్లై నాలుగేళ్లు గడవకముందే ఈ జంట విడాకులు తీసుకుని  అందరికీ షాక్ ఇచ్చారు.  

2010లో విడుదలైన 'ఏమాయ చేశావే' సినిమాతో నాగచైతన్య, సమంతల మధ్య తొలి పరిచయం ఏర్పడింది. ప్రముఖ స్టార్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ తెరకెక్కించిన ఈ చిత్రంలో కార్తీక్- జెస్సీలుగా నాగచైతన్య-సమంతలు అద్భుతంగా నటించారు. వీరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ కి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.

ఇక ఈ సూపర్ హిట్ సినిమాతో ఏర్పడిన  పరిచయమే సమంత, నాగ చైతన్యల మధ్య ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్లింది. ఇరు కుటుంబ సభ్యులు సైతం అంగీకారం తెలపడంతో 2017 అక్టోబర్‌లో గోవా వేదికగా సామ్‌-చైతు అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల నడుమ వీరిద్ద‌రి వివాహం రెండు సాంప్రదాయాల ప్రకారం జరిగింది.  

పెళ్లి జరిగిన కొంతకాలం వరకు ఎంతో సంతోషంగా ఉంటూ అందరికీ ఆదర్శంగా నిలిచిన ఈ జంట.. ఊహించని మనస్పర్థల కారణంగా ఒకరికొకరు దూరమయ్యారు. ప్రస్తుతం అటు నాగచైతన్య ఇటు సమంత‌ సింగల్ లైఫ్ ను లీడ్‌ చేస్తూ కెరీర్‌పైనే ఫోకస్ పెట్టారు. ఇదిలా ఉంటే వీరిద్దరి పరిచయానికి కారణమైన 'ఏమాయ చేశావే' సినిమా గురించి  డైరెక్టర్ గౌతమ్ మీనన్ ఓ ఇంట్ర‌స్టింగ్ విష‌యాన్ని బయటపెట్టారు.  

అదేంటంటే.. 'ఏమాయ చేశావే' సినిమా ఫస్ట్ ఛాయిస్ అసలు నాగచైతన్య కాదట. గౌతమ్ మీనన్ ముందుగా ఈ చిత్రాన్ని టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్‌ బాబు తో తీయాలని భావించారట. ఆయనకు కథ కూడా వినిపించారట. కానీ  మహేశ్‌ ఇలాంటి లవ్ స్టోరీ కాకుండా ఏదైనా యాక్షన్ కథ ఉంటే చేద్దామని అన్నారట. దాంతో నాగచైతన్యను ఎంపిక చేశార‌ట‌.

'ముత్తు' సినిమా ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న‌ గౌతమ్ మీనన్ ఈ విష‌యాన్ని బ‌య‌ట పెట్టారు. అయితే ఒకవేళ మహేష్ బాబు 'ఏమాయ చేశావే' చేసి ఉండుంటే.. సినిమా ఫలితం ఎలా ఉన్నా  చైతుతో ప‌రిచ‌యం, ప్రేమ‌, పెళ్లి, విడాకులు సామ్ కు ఉండేవి కావ‌ని, ఆమె లైఫ్ మరోలా ఉండేదని నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News