ఒకప్పుడు దర్శకులు అంటే కేవలం తెర వెనుక మాత్రమే ఉండేవారు. వీలైనంత వరకూ తెర పై కనిపించకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నించేవారు. కానీ వారిలో కూడా చాలా మంచి నటులు ఉన్నారు అని తెలియడానికి సమయం చాలానే పడుతుంది. అప్పట్లో కొందరు మాత్రమే ప్రత్యేకమైన పాత్రలలో ఆకట్టుకునేవారు. కానీ కాలం మారుతున్న కొద్ది దర్శకులలో కూడా మంచి నటులు బయటకు వస్తున్నారు. ఇక దర్శకులలో ఎక్కువ సినిమాలలో నటించిన వారిలో ప్రస్తుతం గౌతమ్ మీనన్ టాప్ లిస్టులో ఉంటాడు అని చెప్పవచ్చు.
అతను డైరెక్షన్ మొదలు పెట్టినప్పుడు నుంచే కూడా వెండితెరపై ఏదో ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించే ప్రయత్నం చేస్తున్నాడు. అది కూడా తన సినిమాల్లో కాకుండా మిగతా వారి సినిమాల్లో కనిపించే ప్రయత్నం చేస్తున్నాడు. గౌతమ్ వాసుదేవ్ అంటే తెలుగు వారందరికీ కూడా ఎన్నో ప్రేమకథలు గుర్తొస్తూ ఉంటాయి.
ముఖ్యంగా ఏ మాయ చేసావే ఘర్షణ ఆల్ టైం ఫేవరేట్స్ లో ఒకటి అని చెప్పవచ్చు. అయితే ఇటీవల గౌతమ్ వాసుదేవన్ తమిళంలోనే కాకుండా తెలుగు సినిమాల్లో కూడా బాగానే నటిస్తున్నారు. రీసెంట్ గా వచ్చిన సీతారామం సినిమాలో అతను చేసిన ఒక మేజర్ పాత్ర బాగానే వర్కౌట్ అయింది.
మొదట నితిన్ కొరియర్ బాయ్ కళ్యాణ్ అనే సినిమాలో నటించిన గౌతమ్ ఆ తర్వాత తరుణ్ భాస్కర్ ఈ నగరానికి ఏమైంది అనే సినిమాలో కూడా ఒక గెస్ట్ పాత్రలో కనిపించాడు. ఇక ఆ తర్వాత తమిళంలో అయితే వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్లిన ఈ దర్శకుడు తెలుగులో మంచి టైమింగ్ ఉన్న పాత్రలు వస్తే మాత్రం అసలు విడిచి పెట్టడం లేదు. అయితే కేవలం పాజిటివ్ రోల్స్, ఒరిజినల్ క్యారెక్టర్స్ మాత్రమే కాకుండా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు కూడా చేయాలి అని ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే తమిళ దర్శకుడు సముద్రఖని పవర్ఫుల్ విలన్ గా తమిళం లోను ఇటు తెలుగులోనూ బాగానే రానిస్తున్నాడు.
ఇక గౌతమ్ వాసుదేవ్ కూడా విజయ్ సినిమాలో పవర్ఫుల్ విలన్ గా కనిపించబోయే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. విజయ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో చేయబోతున్న సినిమాలో మెయిన్ విలన్ గా పృథ్వీరాజ్ సుకుమారన్ కనిపించబోతుండగా అందులో మరొక విలన్ గా గౌతమ్ వాసుదేవ్ సెలెక్ట్ అయినట్లుగా తెలుస్తోంది.
ఇప్పటికే స్క్రిప్ట్ కు సంబంధించిన పనులు కూడా ఫినిష్ అయినట్లు సమాచారం. అసలే విక్రమ్ సినిమాతో నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లు కూడా చాలా బలంగా చూపించిన లోకేష్, వాసుదేవ్ ని కూడా అదే తరహాలో ప్రజెంట్ చేస్తాడు అని చెప్పవచ్చు. త్వరలోనే ఈ విషయంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. యాక్టింగ్ కెరీర్ ఇలా ఉంటె గౌతమ్ డైరెక్షన్ లో సినిమాలు పెద్దగా లేవు అన్నది నిజం .