వెంటాడుతున్న సొంత బ్యానర్ సెంటిమెంట్

Update: 2016-01-28 17:30 GMT
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు సరైనోడు చిత్రంతో ఫుల్లు బిజీగా ఉన్నాడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీకి.. తాజాగా ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేశారు. కంప్లీట్ బోయపాటి మార్క్ సినిమాగా కనిపిస్తున్న ఈ మూవీలో.. బన్నీ మాస్ లుక్ తో అదరగొడుతున్నాడు.

అల్లు వారబ్బాయికి మాస్ హీరోగా కంటే క్లాస్ - యూత్ - ఫ్యామిలీ ఆడియన్స్ లోనే ఫాలోయింగ్ ఎక్కువ అని ఒప్పుకోవాల్సిందే. అయితే సరైనోడు మాత్రం కంప్లీట్ మాస్ గా కనిపిస్తుండడంతో.. ఇండస్ట్రీలో కొంచెం అనుమానాలు పెరుగుతున్నాయి. అలాగే బన్నీని బ్యానర్ సెంటిమెంట్ కూడా వెంటాడుతోంది. సరైనోడు మూవీని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. ఈ బ్యానర్ పై చిరంజీవి, పవన్ కళ్యాణ్ - రామ్ చరణ్ లకు బ్లాక్ బస్టర్స్ అందించిన అరవింద్.. తన కొడుకు బన్నీకి మాత్రం చెప్పుకోదగ్గ చిత్రాన్ని ఇవ్వలేకపోయాడు.

గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ రెండు సినిమాలు చేశాడు. ఒకటి హ్యాపీ అయితే, రెండోది బద్రీనాథ్. హ్యాపీ యావరేజ్ సినిమాగా నిలవగా.. బద్రీనాథ్ ఫ్లాప్ అయింది. బద్రీనాథ్ తర్వాత.. పూర్తి స్థాయి భారీ చిత్రాల నిర్మాణానికి అల్లు అరవింద్ దూరమయ్యారు కూడా. చిన్న చిత్రాలను తీయడమో, కో ప్రొడ్యూస్ చేయడమో తప్ప.. పెద్ద సినిమాలనే తీయలేదు. మరి ఇప్పుడైనా సరైనోడు రూపంలో.. బన్నీకి బ్లాక్ బస్టర్ ఇస్తారేమో చూడాలి.
Tags:    

Similar News