టాలీవుడ్లో ఈ మధ్య కొత్త ట్రెండు కనిపిస్తోంది. బడా బేనర్లు ప్రొడక్షన్ విషయంలో కొత్త బాటలో నడుస్తున్నాయి. వేరే బేనర్లతో కలిసి సినిమాలు తీస్తూ రిస్క్ తగ్గించుకుంటున్నాయి. తక్కువ బడ్జెట్లో మరో బేనర్ తో కలిసి చిన్న-మీడియం సినిమాలు తీస్తూ ఖర్చు పంచుకుంటున్నాయి. ఇలాంటి సినిమాలు హిట్టయితే రెండు సంస్థలకూ మంచి లాభాలు వస్తున్నాయి. నష్టాలు వస్తే ఎవరికీ పెద్దగా భారం పడట్లేదు. ప్రొడక్షన్ వ్యవహారాలు చూసుకోవడంలోనూ పనిభారం తగ్గుతోంది. గీతా ఆర్ట్స్ ఇప్పటికే యువి క్రియేషన్స్.. శ్రీ వేంకటేశ్వరా క్రియేషన్స్ బేనర్లతో కలిసి భలే భలే మగాడివోయ్.. పిల్లా నువ్వు లేని జీవితం లాంటి సినిమాలు తీసిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు గీతా ఆర్ట్స్.. యువి క్రియేషన్స్ తో పాటు ప్రముఖ తమిళ నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ కలిసి ఉమ్మడిగా ‘వీ-4’ పేరుతో కొత్త బేనర్ మొదలుపెట్టడం విశేషం. అల్లు అరవింద్-బన్నీ వాసు (గీతా ఆర్ట్స్).. వంశీ-ప్రమోద్ (యువి).. జ్నానవేల్ రాజా (స్టూడియో గ్రీన్) ఇకపై ఉమ్మడిగా సినిమాలు తీయబోతున్నారు. ఈ ఏడాదే ‘వీ-4’ బేనర్లో మూడు సినిమాలు రాబోతున్నట్లు సమాచారం. త్వరలోనే వీటి వివరాలు వెల్లడిస్తారట. కొత్త ఐడియాలతో వచ్చే వర్ధమాన దర్శకులతో తక్కువ బడ్జెట్లో సినిమాలు తీయాలన్నది వీళ్ల ప్లాన్. ఈ ఏడాది వచ్చే సినిమాల ఫలితాల్ని బట్టి ఆ తర్వాత మరింత జోరు పెంచాలని దీర్ఘకాలిక ప్రణాళికలతోనే ఉన్నారు ఈ మెగా ప్రొడ్యూసర్స్. వీరి ఉమ్మడి ప్రయత్నం ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూద్దాం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/