మంచు విష్ణు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ''జిన్నా''. ఆయన స్వీయ నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాకి ఇషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో విష్ణు సరసన హాట్ భామలు పాయల్ రాజ్ పుత్ మరియు సన్నీ లియోన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
'జిన్నా' చిత్రాన్ని తెలుగు మలయాళ హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ గ్లిమ్స్ ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర బృందం హైదరాబాద్ ఏఎంబీ సినిమాస్ లో నిర్వహించిన కార్యక్రమంలో టీజర్ ను లాంచ్ చేశారు.
ఇందులో జిన్నా టెంట్ హౌజ్ ఓనర్ గా మంచు విష్ణు కనిపించాడు. జిన్నా టైంకు రావడంతో పాటు బ్యాడ్ టైంను కూడా తీసుకొస్తాడు అంటూ విష్ణు క్యారెక్టర్ ను పరిచయం చేశారు. ఊరంత అప్పులు చేసిన పనికిమాలిన వాడిగా అతని గురించి పేర్కొన్నారు.
అప్పుల బాధ నుంచి బయట పడేయడానికి సాక్షాత్తూ లక్ష్మీ దేవి రావాలని అనుకుంటుండగా.. విష్ణు లైఫ్ లోకి ఎన్నారై సన్నీలియోన్ ఎంట్రీ ఇస్తుంది. ఆమె రాకతో జిన్నా టైం స్టార్ట్ అయిందని అనుకుంటుండగా.. కథలో ట్విస్ట్ ని చూపించారు.
సన్నీలియోన్ శరీరంలోకి ఓ ఆత్మ ప్రవేశించినట్లు టీజర్ చూస్తే తెలుస్తుంది. నన్ను చంపేస్తావా బాబాయ్ అంటున్న ఆ దెయ్యం వెనుక కథ ఏంటి? దాని బారి నుండి హీరోయిన్ ని విష్ణు ఎలా కాపాడాడు? అనేది తెలియాలంటే 'జిన్నా' సినిమా చూడాల్సిందే.
ఇందులో జిన్నా ప్రేయసిగా పచ్చళ్ల స్వాతిగా పాయల్ రాజ్ పుత్ కనిపించింది. నరేష్ - సునీల్ - వెన్నెల కిశోర్ - రఘుబాబు - చమ్మక్ చంద్ర తదితరులు ఇతర పాత్రల్లో కనిపించారు. విష్ణు తొలిసారిగా డిఫరెంట్ స్లాంగ్ లో డైలాగ్స్ చెప్పే ప్రయత్నం చేశారు.
కొంతకాలంగా వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న విష్ణు.. హిట్ కోసం ఈసారి రొమాంటిక్ హారర్ కామెడీని నమ్ముకున్నట్లు అర్థమవుతోంది. ఇందులో యాక్షన్ కు కూడా ప్రాధాన్యత ఉన్నట్లు హింట్ ఇచ్చారు. గతంలో ఇలాంటి జోనర్స్ ని డీల్ చేసిన ప్రముఖ రచయిత కోన వెంకట్ కథ - స్క్రీన్ ప్లే అందించడమే కాకుండా క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు.
అనూప్ రూబెన్స్ సమకూర్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ మరియు సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడు విజువల్స్ దీనికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఓవరాల్ గా 'జిన్నా' టీజర్ సినిమాపై ఆసక్తిని కలిగించేలా ఉందని చెప్పాలి.
మంచు అవ్రమ్ భక్త సమర్పణలో ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై మంచు మోహన్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రభుదేవా - గణేష్ ఆచార్య - ప్రేమ్ రక్షిత్ వంటి పాపులర్ డ్యాన్స్ మాస్టర్స్ ఈ సినిమాలో పాటలకు కొరియోగ్రఫీ చేశారు.
'జిన్నా' చిత్రాన్ని అక్టోబర్ నెలలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. త్వరలోనే రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసే అవకాశం ఉంది. 'మోసగాళ్ళు' వంటి డిజాస్టర్ తర్వాత మంచు విష్ణు నటించిన ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Full View