10శాతం వాటా ఇవ్వండి.. 'మాస్టర్' నిర్మాతలకు ఎగ్జిబిటర్స్ డిమాండ్!

Update: 2021-01-28 17:30 GMT
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ లేటెస్ట్ మూవీ 'మాస్టర్'. పొంగల్ బరిలో నిలిచిన ఈ మూవీ తమిళనాట ఘన విజయం సాధించింది. మిగిలిన ప్రాంతాల్లో టాక్ పరిస్థితి ఎలా ఉన్నా.. కలెక్షన్ల పరంగా మంచి విజయాన్నే నమోదు చేసింది. ఇక తమిళంలో బాక్సాఫీస్ ను షేక్ చేసింది.

అయితే.. రెండు వారాల గ్యాప్ తోనే ఓటీటీలో స్ట్రీమ్ కాబోతోందీ చిత్రం. ఈ నెల 28న రాత్రి పది గంటలకు ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో మాస్టర్ రిలీజ్ కాబోతోంది. ఈ నిర్ణయంతో ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ ఆందోళన చెందుతున్నారు. విడుదలైన రెండు వారాల్లోనే సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తే.. ఇక, థియేటర్లకు ప్రేక్షకులు ఎలా వస్తారని అంటున్నారు. దీంతో.. ఎగ్జిబిటర్స్ అంతా నిర్మాతతో సమావేశం అయ్యారు.

మాస్టర్ ను OTTలో రిలీజ్ చేయడం వల్ల తమకు కలిగే నష్టాలను భర్తీ చేయడానికి ఓటీటీ ప్రాఫిట్ లో 10 శాతం తమకు చెల్లించాలని కోరుతున్నారు. అయితే.. నిర్మాతలలో ఒకరైన లలిత్ కుమార్ వారి డిమాండ్ ను మరో విధంగా తీర్చే ప్రయత్నం చేశారు. సినిమా 17 వరోజు నుండి వచ్చే లాభాల్లో మొత్తం వాటాను తీసుకోవాలని ఎగ్జిబిటర్లకు సూచించారట. మరి, ఈ ప్రతిపాదనకు ఎగ్జిబిటర్లు ఏం చెబుతారన్నది చూడాల్సి ఉంది.

జేవియర్ బ్రిట్టో, లలిత్ కుమార్ నిర్మాణంలో లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన మాస్టర్ మూవీ జనవరి 13న రిలీజ్ అయిన విషయం తెలిసిందే. కలెక్షన్ల పరంగా బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ మూవీ.. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 225 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
Tags:    

Similar News