వివాదం ఇంపాక్ట్ లేదు.. గోపికి అఖిల్ 4 ఛాన్స్!

Update: 2019-04-25 09:41 GMT
అక్కినేని అఖిల్ తన నాలుగవ సినిమాను బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే.  ఈ చిత్రాన్ని సీనియర్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.  ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతం జోరుగా సాగుతోంది. తాజాగా ఈ సినిమాకోసం సంగీత దర్శకుడిగా గోపి సుందర్ ను ఎంపిక చేశారని సమాచారం.

ఈ సినిమాకు మొదట దేవీ శ్రీ ప్రసాద్ ను మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకున్నారనే వార్తలు వచ్చాయి.  తర్వాత మరో టాప్ లీగ్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ పేరు వినిపించింది.  కానీ ఎందుకో ఇద్దరినీ కాదని గోపి సుందర్ కే ఓటు వేశారని సమాచారం. దేవీ శ్రీ ప్రసాద్.. థమన్ లతో పోలిస్తే గోపి సుందర్ రెమ్యూనరేషన్ తక్కువే.  సినిమా బడ్జెట్ ను తగ్గించాలన్న ఉద్దేశంతోనే గోపి సుందర్ ను ఎంపిక చేశారనే టాక్ వినిపిస్తోంది.  అయితే గోపిని సంగీత దర్శకుడిగా ఎంచుకోవడం మరోరకంగా హాట్ టాపిక్ అయింది.

గోపి సుందర్ ఈమధ్య రిలీజ్ అయిన నాగచైతన్య ఫిలిం 'మజిలీ' కి సంగీతం అందించాడు. కానీ చివరి నిముషంలో వ్యక్తిగత కారణాల వల్ల సినిమానుండి తప్పుకున్నాడని..దీంతో నిర్మాతలు ఇబ్బంది పడ్డారని.. థమన్ తో నేపథ్య సంగీతాన్ని పూర్తి చేశారని తెలిసిందే.  నిర్మాతలు గోపి సుందర్ పై ఫిలిం ఛాంబర్ లో ఫిర్యాదు చేసేందుకు రెడీ కావడంతో గోపి సుందర్ రాజీ చేసుకున్నాడని.. కొంత రెమ్యూనరేషన్ వెనక్కు ఇచ్చాడని అన్నారు. మరి చైతు సినిమా విషయంలో వివాదం నెలకొన్నప్పటికీ తమ్ముడు అఖిల్ సినిమాకు అదే మ్యూజిక్ డైరెక్టర్ ను ఎంచుకోవడం గొప్ప విషయమే.   వివాదం సంగతేమో కానీ గోపి సుందర్ మంచి క్యాలిటీ మ్యూజిక్ అందిస్తాడనడంలో ఏం సందేహాలు లేవు.  


Tags:    

Similar News