యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ అయిన గోపీచంద్ ప్రస్తుతం తమిళ దర్శకుడు తిరు డైరెక్షన్లో ఒక స్పై థ్రిల్లర్లో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి 'చాణక్య' అనే టైటిల్ ను నిన్నే ఫిలిం మేకర్స్ ప్రకటించారు. ఈ రోజు గోపీచంద్ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా అభిమానులకు కానుకగా 'చాణక్య' ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లోనే గోపీచంద్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ పోస్టర్ లో ఫుల్ గా గడ్డం పెంచి గోపిచంద్ కొత్త గెటప్ లో ఉన్నాడు. బ్లాక్ టీషర్ట్ ధరించి దానిపై చిరుగులు ఉండే మరో వైట్ టీషర్ట్ ధరించి.. స్టైలిష్ గా ఒక స్టోల్ ను మెడకు చుట్టుకొని డిఫరెంట్ గా కనిపిస్తున్నాడు. ఓల్డ్ సిటీలో.. ఇసుక వేస్తే రాలనంతమంది జనాలున్న రోడ్ పై నడుస్తున్నాడు. గోపిచంద్ ఇంటెన్స్ లుక్ చూడగానే ఆకట్టుకునేలా ఉంది. సినిమా టైటిల్.. గోపీచంద్ లుక్ ను చూస్తే ఏదో సీక్రెట్ మిషన్ లో ఉన్నాడనిపిస్తోంది.
గోపీచంద్ ఈమధ్య నటించిన సినిమాలు పెద్దగా విజయం సాధించలేదు. మరి ఈ 'చాణక్య' గోపిచంద్ కు విజయాన్ని అందిస్తుందేమో వేచి చూడాలి. ఈ సినిమాలో గోపీచంద్ సరసన మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తోంది. విశాల్ చంద్రశేఖర్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమాను అనిల్ సుంకర నిర్మిస్తున్నారు.