హీరోగా ప్రస్థానం మొదలుపెట్టి.. ఆశించిన ఫలితం రాకపోవడంతో తర్వాత విలన్ అవతారమెత్తి.. ఆ పాత్రల్లో మంచి పేరు వచ్చాక తిరిగి హీరోగా మారి.. ఆ రకంగానూ సక్సెస్ అందుకున్నాడు గోపీచంద్. ఒకసారి హీరోగా హిట్టు కొట్టాక వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన ఈ హీరో.. మాస్ లో మంచి ఫాలోయింగే సంపాదించుకున్నాడు. కానీ మాస్ పేరుతో మూస సినిమాలకే పరిమితం అయిపోవడం.. కొత్తగా ట్రై చేసిన సినిమాల్లో ఏదో లోపం ఉండటం.. ఇలా రకరకరాల కారణాలతో అతడి కెరీర్ గాడి తప్పింది. గత ఆరేడేళ్లలో ‘లౌక్యం’ మినహాయిస్తే అతడికి హిట్టే లేదు. ‘లౌక్యం’తో అయినా గాడిన పడతాడనుకుంటే.. ఆ తర్వాత వచ్చిన ‘సౌఖ్యం’.. ‘గౌతమ్ నంద’.. ‘ఆక్సిజన్’ తేడా కొట్టేశాయి. ఇప్పుడు అతడి ఆశలన్నీ ‘పంతం’ మీదే ఉన్నాయి.
ఈ చిత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ హిట్ కావాల్సిందే. లేకుంటే గోపీచంద్ కెరీర్ మరింత ఇబ్బందికర పరిస్థితుల్లోకి వెళ్తుంది. ‘పంతం’ గోపీకి ల్యాండ్ మార్క్ ఫిలిం కూడా. ఇది అతడికి 25వ సినిమా. ఇందులో ఏదో ఒక ప్రత్యేకత చూపించాలి. సక్సెస్ సాధించాలి. గోపీ వరుస ఫ్లాపుల్లో ఉన్నప్పటికీ.. అతడి మార్కెట్ దెబ్బ తిన్నప్పటికీ నిర్మాత రాధామోహన్ రాజీ లేకుండా ఈ చిత్రాన్ని భారీగానే నిర్మించాడు. కొత్త దర్శకుడు చక్రవర్తి రూపొందించిన ఈ చిత్రంలో పెద్దగా కొత్తదనం కనిపించకపోయినా.. మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ లాగే అనిపించింది. కానీ ఈ తరహా సినిమాల ఫలితంపై ఈ రోజుల్లో ఒక అంచనాకు రావడం కష్టమే. ఏదో ఆషామాషీగా సినిమాలుంటే మాత్రం జనాలకు నచ్చట్లేదు. సినిమాలో ఏదో ఒక ప్రత్యేకత కనిపించాలి. ఆ ప్రత్యేకత ‘పంతం’లో ఉందా లేదా అన్నది చూడాలి. బాక్సాఫీస్ కొంచెం స్లంప్ లో ఉన్న టైంలో వస్తున్న ఈ చిత్రం ఏమేరకు ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పిస్తుంది.. గోపీకి ఎలాంటి ఫలితాన్నందిస్తున్నది ఆసక్తికరం.