ఫోటో స్టోరీ : బహుశా ఓ చంచలా.. ఎగిరే రాయంచలా..!

Update: 2022-11-11 23:30 GMT
తన టాలెంట్ తో బాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారి సత్తా చాటుతుంది అందాల భామ కియరా అద్వాని. కెరియర్ మొదట్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ వచ్చిన అమ్మడు వచ్చిన ప్రతి ఛాన్స్ ని వాడుకుంది. ఎమ్మెస్ ధోని సినిమాలో తన పాత్రలో అలరించగా ఆ మూవీ నుంచి ఆమెకి సూపర్ క్రేజ్ ఏర్పడింది.

ఇక లస్ట్ స్టోరీస్ తో కియరా బీ టౌన్ ఆడియన్స్ ని బెంబేలెత్తించింది. ఆ వెబ్ సీరీస్ లో కియరా ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ కి బాలీవుడ్ అంతా ఫిదా అయ్యింది. ఇక ఆ సీరీస్ తర్వాత కియరాకి తిరుగులేకుండా ఆఫర్లు వచ్చాయి.

ఈ క్రమంలోనే తెలుగులో మహేష్ తో భరత్ అనే నేను సినిమా తీసి హిట్ అందుకున్న కియరా చరణ్ తో వినయ విధేయ రామ సినిమాలో కూడా నటించింది. బాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకెళ్తున్న అమ్మడు తన ఫోటో షూట్స్ తో కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుంది.

లేటెస్ట్ గా ట్రెండీ వేర్ హాట్ లుక్స్ థైస్ షో.. కియరా కేకపెట్టించేస్తుంది. అమ్మడిని చూసి ఎవరైనా సరే మరో వేటూరి.. సీతారామశాస్త్రి గారిలా మారి ఆమె అందాన్ని వర్ణించేలా ఉన్నారు. కియారా లేటెస్ట్ ఫోటోస్ కి బహుశా ఓ చంచలా.. ఎగిరే రాయంచలా.. తగిలేలే మంచులా అంటూ ప్రేమ గీతాలు పాడేస్తున్నారు.   

బ్యూటీ విత్ టాలెంట్ క్యాప్షన్ కి పర్ఫెక్ట్ సూట్ అయ్యే అమ్మడి సొగసులకు బాలీవుడ్ ప్రేక్షకులే కాదు సౌత్ ఆడియన్స్ కూడా ఆమె వలలో పడుతున్నారు. తెలుగులో రెండు సినిమాలు చేసిన కియరా లేటెస్ట్ గా శంకర్ డైరక్షన్ లో చరణ్ హీరోగా చేస్తున్న సినిమాలో కూడా ఛాన్స్ దక్కించుకుంది. తను చేస్తున్న సినిమాలు ఓ పక్క తన ఫోటో షూట్స్ మరో పక్క వీటితో కియరా ఊహించని రేంజ్ లో తన ఇమేజ్ పెంచుకుంటూ వస్తుంది.

అంతేకాదు కెరియర్ ఇంత ఫాం లో ఉన్న టైం లో కూడా వెబ్ సీరీస్ లను వదలట్లేదు కియరా. వెబ్ సీరీస్ ల వల్లే తనకు ఈ పాపులారిటీ వచ్చిందని వాటి మీద ప్రత్యేక దృష్టి పెట్టింది కియరా. తప్పకుండా అమ్మడి కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుందని చెప్పొచ్చు. నార్త్ సైత్ అనే తేడా లేకుండా కియరా అద్వాని తన సినిమాలతో సందడి చేస్తుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News