బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారీని నేటి ఉదయం (ఆదివారం) ముంబైలోని రాజ్ భవన్‌లో కలవనున్నారు. ఈ సమావేశంలో బీఎంసీ బృందాలు తన బాంద్రా కార్యాలయం కూల్చివేసిన తీరులో అన్యాయంపై చర్చించనున్నారు. నిజానికి ఈ డ్రైవ్ అన్యాయమైనదని.. చట్టవిరుద్ధమైన మార్పులతో తన ఆఫీస్ ని కూల్చేశారని కంగన ఇప్పటికే ఆరోపించింది. తనకు అవసరమైన అన్ని పత్రాలు అనుమతులు ఉన్నాయని మార్పుల పేరుతో కూల్చేసారని ఆవేదన వ్యక్తం చేసింది.
ఇక శివసేన వర్సెస్ కంగన ఎపిసోడ్స్ లో భాగంగానే ఇదంతా జరిగిందని అభిమానులు ఆమె అనుచరులు నమ్ముతున్నారు. ఇకపోతే నటీనటుల కార్యాలయ స్థలంలో కూల్చివేతపై మహారాష్ట్ర గవర్నర్ ను కలిసి తన అసంతృప్తిని తెలియజేయనుందని.. అయితే అలాంటి అసమ్మతిని వ్యక్తం చేయడాన్ని గవర్నర్ ఖండించారని ఇప్పటికే మీడియాలో గుసగుస వినిపిస్తోంది.
``నేను ఎక్కడా ఆగ్రహం వ్యక్తం చేయలేదు`` అని గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ చెప్పినట్లు పిటిఐపై నివేదికలు పేర్కొన్నాయి. కంగనపై శివసేన పార్టీ సభ్యుల మధ్య మాటల యుద్ధం నేపథ్యంలో ఈ కూల్చివేత జరిగిందా? అన్నది విచారించారట. ముంబైని పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పోకె) తో పోల్చడం నచ్చని రాజకీయ పార్టీలు లొల్లు చేశాయని కంగన అనుచరులు ఇప్పటికే ప్రకటించిన సంగతి విధితమే. ఇక కంగన వెన్నంటి నిలిచి భాజపా పార్టీ వంత పాడడం పైనా పలు రకాలుగా చర్చ సాగుతోంది.