యువ హీరో అడివి శేష్ లీడ్ రోల్ లో వస్తున్న సినిమా గూఢచారి 2. గూఢచారి సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమా నెక్స్ట్ లెవల్ లో ఉంటుందని అంటున్నారు హీరో అడివి శేష్. లేటెస్ట్ గా జరిగిన గూఢచారి 2 (జి2) ప్రీ విజన్ లాంచ్ ఈవెంట్ లో ఆయన మాట్లాడుతూ తెలుగు సినిమాను ప్రపంచ వ్యాప్తంగా తీసుకెళ్లాలనే తపన ఉంది. అందుకే గూఢచారి 2 ఈసారి పెద్దగా ప్లాన్ చేస్తున్నామని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా చూసేలా సినిమా ప్లాన్ చేస్తున్నామని అన్నారు.
ఇక ఇప్పుడు హాలీవుడ్ వాళ్లను మెప్పించడం అనేది కల కాదు. ఆల్రెడీ రాజమౌళి గారు అది ప్రూవ్ చేశారు. ఈ ఫ్రాంచైజ్ ని హోం గ్రోన్ ఇండియన్ స్పై థ్రిల్లర్ గా తీసుకెళ్లాలని అనుకుంటున్నాం అని అన్నారు అడివి శేష్. ఇక ఈ సినిమాకు వినయ్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు.
గూఢచారి, మేజర్ సినిమాకు మాకు వచ్చిన డౌట్స్ ని అతను తీరుస్తూ వచ్చాడు. మంచి విజన్ ఉన్న దర్శకుడు. ఈ సినిమా నిర్మాతలు విష్ణు ప్రసాద్, అనీల్, అభిషేక్ లకు థ్యాంక్స్ చెప్పారు అడివి శేష్. సినిమాకు ఏం కావాలంటే అది ఇచ్చారని అన్నారు.
ఇక ఈ సినిమాను 1, 1.5 ఏళ్లలో పూర్తి చేస్తామని.. ఇది కచ్చితంగా నెక్స్ట్ లెవల్లో ఉంటుందని. తాను ఈ విషయాన్ని గర్వంగా చెప్పగలను అని అన్నారు. గూఢచారి 1 తర్వాత సౌత్ ఇండియాలో స్పై సినిమాల ట్రెండ్ మొదలైంది.
జి2 తర్వాత ఆల్ ఇండియా ఫ్రాంచైజ్ గా సినిమాలు వస్తాయి. ఇక త్వరలో కథ పూర్తి చేసి వినయ్ సిక్స్ ప్యాక్ అడుగుతున్నాడు దాని పని మీద ఉండాలని అన్నారు అడివి శేష్.
మా మధ్య ఎలాంటి పోటీ లేదు. మేజర్ కు ఆన్ లైన్ ఎడిటర్ గా చేసిన పీకే ఇప్పుడు మెయిన్ ఎడిటర్ గా చేస్తున్నాడు. నెక్స్ట్ అతను లైన్ లో ఉన్నాడు. మాకు ఎవరితో పోటీ లేదు. ఎలాంటి కాంపిటీషన్ లేదు. మా ఎకో సిస్టం తో నేను వాళ్లకు పనిచేయాలి.. వాళ్లు నాకు పనిచేయాలి అని అన్నారు అడివి శేష్. మొత్తానికి గూఢచారి 2 ఈసారి చాలా పెద్ద స్కెచ్ వేసినట్టు అనిపిస్తుంది. అడివి శేష్ ఇంత కాన్ఫిడెంట్ గా చెప్పాడు అంటే సినిమా తప్పకుండా నెక్స్ట్ లెవల్ లో ఉంటుందని ఫిక్స్ అవ్వొచ్చు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.Full View
ఇక ఇప్పుడు హాలీవుడ్ వాళ్లను మెప్పించడం అనేది కల కాదు. ఆల్రెడీ రాజమౌళి గారు అది ప్రూవ్ చేశారు. ఈ ఫ్రాంచైజ్ ని హోం గ్రోన్ ఇండియన్ స్పై థ్రిల్లర్ గా తీసుకెళ్లాలని అనుకుంటున్నాం అని అన్నారు అడివి శేష్. ఇక ఈ సినిమాకు వినయ్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు.
గూఢచారి, మేజర్ సినిమాకు మాకు వచ్చిన డౌట్స్ ని అతను తీరుస్తూ వచ్చాడు. మంచి విజన్ ఉన్న దర్శకుడు. ఈ సినిమా నిర్మాతలు విష్ణు ప్రసాద్, అనీల్, అభిషేక్ లకు థ్యాంక్స్ చెప్పారు అడివి శేష్. సినిమాకు ఏం కావాలంటే అది ఇచ్చారని అన్నారు.
ఇక ఈ సినిమాను 1, 1.5 ఏళ్లలో పూర్తి చేస్తామని.. ఇది కచ్చితంగా నెక్స్ట్ లెవల్లో ఉంటుందని. తాను ఈ విషయాన్ని గర్వంగా చెప్పగలను అని అన్నారు. గూఢచారి 1 తర్వాత సౌత్ ఇండియాలో స్పై సినిమాల ట్రెండ్ మొదలైంది.
జి2 తర్వాత ఆల్ ఇండియా ఫ్రాంచైజ్ గా సినిమాలు వస్తాయి. ఇక త్వరలో కథ పూర్తి చేసి వినయ్ సిక్స్ ప్యాక్ అడుగుతున్నాడు దాని పని మీద ఉండాలని అన్నారు అడివి శేష్.
మా మధ్య ఎలాంటి పోటీ లేదు. మేజర్ కు ఆన్ లైన్ ఎడిటర్ గా చేసిన పీకే ఇప్పుడు మెయిన్ ఎడిటర్ గా చేస్తున్నాడు. నెక్స్ట్ అతను లైన్ లో ఉన్నాడు. మాకు ఎవరితో పోటీ లేదు. ఎలాంటి కాంపిటీషన్ లేదు. మా ఎకో సిస్టం తో నేను వాళ్లకు పనిచేయాలి.. వాళ్లు నాకు పనిచేయాలి అని అన్నారు అడివి శేష్. మొత్తానికి గూఢచారి 2 ఈసారి చాలా పెద్ద స్కెచ్ వేసినట్టు అనిపిస్తుంది. అడివి శేష్ ఇంత కాన్ఫిడెంట్ గా చెప్పాడు అంటే సినిమా తప్పకుండా నెక్స్ట్ లెవల్ లో ఉంటుందని ఫిక్స్ అవ్వొచ్చు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.