ప్రతాపరుద్రుడు కాదు హిరణ్యకసిపుడు

Update: 2016-12-07 10:09 GMT
చారిత్రక కథాంశంతో చరిత్ర సృష్టించికపోయినా రుద్రమదేవి లాంటి ఓ గొప్ప సినిమాను తెలుగు చిత్ర పరిశ్రమకు అందించాడు దర్శకుడు గుణశేఖర్. బాహుబలి చూసిన కళ్లతో రుద్రమదేవి గొప్పగా అనిపించనప్పటికీ.. చరిత్ర మీద గుణశేఖర్ కున్న ఇష్టాన్ని.. సినిమాగా తీసిన కష్టాన్ని అందరూ గుర్తించారు. రుద్రమదేవి పాత్రకి అనుష్క ప్రాణం పోసిందంటే దాని వెనకున్న గుణశేఖర్ కృషి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక రుద్రమదేవి ఎండ్ టైటిల్స్ లో ప్రతాపరుద్రుడు అని వేసి సీక్వెల్ ఉంటుందని హింట్ ఇచ్చాడు.

ప్రతాపరుద్రుడి చరిత్రని కూడా సినిమాగా తీస్తానని.. ఈ సారి అల్లాటప్పాగా ఉండదని.. పెద్ద పెద్ద స్టార్లని అప్రోచ్ అవుతున్నానని చెప్పాడు కూడా. మరి ఆ ప్రయత్నాలు ఏమయ్యాయో లేకపోతే మనసు మార్చకున్నాడో కానీ ఇప్పుడు ప్రతాపరుద్రుడు పక్కకి వెళ్లిపోయి హిరణ్యకసిపుడు వచ్చాడు. రీసెంట్ గా గుణా టీమ్ వర్క్స్ బ్యానర్ పేరు మీద హిరణ్యకసిపుడు టైటిల్ ని రిజిస్టర్ చేయించడంతో గుణశేఖర్ చరిత్ర నుంచి పురాణాల వైపు మళ్లాడనే విషయం అర్థమైంది.

భక్త ప్రహ్లాద- హిరణ్యకసిపుడు గురించి ఇప్పటివరకు ఒక్క సినిమానే వచ్చింది. అయితే గుణశేఖర్ ప్రహ్లాదుడి పేరు కాకుండా హిరణ్యకసిప అని టైటిల్ పెట్టడం ఆసక్తిని పెంచుతోంది. ఇక ఎప్పట్లాగే తన కొత్త మూవీలో హిరణ్యకసిప.. లక్ష్మీనరసింహుడు కేరెక్టర్స్ కి పెద్ద పెద్ద ఆర్టిస్ట్ ల్ని తీసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. మొత్తానికి డ్రీమ్ సబ్జెక్ట్ అంటూ కాకతీయ వంశీయుల చరిత్రని సిరీస్ గా తెస్తాడనుకుంటే ప్రతాపరుద్రుడి బదులు హిరణ్యకసిపుడిని సీన్ లోకి తెచ్చాడు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News