ట్రైలర్ టాక్: సగం గాళ్‌ ఫ్రెండ్ వచ్చింది

Update: 2017-04-10 19:30 GMT
చాలారోజుల నుండి హీరో అర్జున్ కపూర్ షూటింగులో చాలా బిజీగా ఉన్నాడు. ఇప్పటికే మనోడు రైటర్ చేతన్ భగత్ రాసిన ''2 స్టేట్స్'' నవలను సినిమాగా రూపొందించి పెద్ద హిట్టే కొట్టేశాడు. ఇప్పుడు అదే రచయిత రాసిన మరో నవలకు దృశ్యరూపం ఇచ్చేస్తున్నాడు. ఆ సినిమాయే ''హాఫ్‌ గాళ్‌ ఫ్రెండ్''. అదే పేరుతో వచ్చిన నవల కూడా మనకు తెలిసిందే. ఇప్పుడు ''ఏక్ విలన్'' సినిమాలో తన అమాయకత్వంతో ఆకట్టుకున్న శ్రద్దా కపూర్.. ఈ టైటిల్ పాత్రలో మెరస్తుండగా.. అదే సినిమాను డైరక్ట్ చేసిన మోహిత్ సూరి ఈ సినిమానూ రూపొందిస్తున్నాడు.

బీహార్ లో పుట్టిపెరిగిన ఆ కథానాయకుడికి.. ఒక పోష్‌ అమ్మాయి పరిచయం అవుతుంది. మనోడు ఇంగ్లీష్‌ రాని ఒక బ్రైట్ స్టూడెంట్ అయితే.. ఆమె అందంగా ఉంటూ మత్తెక్కించే ఒక బాస్కెట్ బాల్ ప్లేయర్. కేవలం నీ హాఫ్‌ గాళ్‌ ఫ్రెండ్ గా ఉండగలను కాని.. నిన్ను ప్రేమించలేను అంటూ మనోడి ప్రేమ ప్రపోజల్ ను తిరస్కరిస్తుంది. అక్కడితో వెర్రెత్తిపోయిన ఈ ప్రియుడు.. ఇంగ్లీష్‌ బాగా నేర్చుకుని.. అప్పటికే న్యూయార్క్ వెళిపోయిన ఆమెను వెతుక్కుంటూ వెళతాడు. ఆ తరువాత ఏం జరుగుతుంది? ఈ సగం గాళ్‌ ఫ్రెండ్ ఫుల్లు గాళ్‌ ఫ్రెండు అవుతుందా అనేదే కథ!!

ట్రైలర్ చూస్తే బాగానే ఉంది. మోహిత్ సూరి యథావిథిగా ఎమోషన్లతో పిండేశాడు. అర్జున్ కపూర్ కూడా ఇంప్రెస్ చేస్తున్నాడు. అలాగే శ్రద్దగా మన సెక్సీ బ్యూటీ కూడా సోకులను బాగానే ఆరబోసింది. మే 19న విడుదలయ్యే సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి మరి.

Full View

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News