పరిణితి ప్రేమ బంతికి హార్దిక్ బౌల్డ్?

Update: 2017-09-04 17:24 GMT
ప్రస్తుత రోజుల్లో సెలబ్రిటీలు జోడిగా కనిపిస్తే చాలు మీడియాలో వారి గురించి వార్తలు ఏ రేంజ్ లో వస్తాయో చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా బాలీవుడ్ మీడియాలో అయితే ఇలాంటి పుకార్లు రోజుకోకటి వెలువడుతుంటాయి. బాలీవుడ్ హీరో హీరోయిన్స్ తో పాటు క్రికెటర్లు కూడా ఇటువంటి రూమర్స్ లో చోటు సంపాదించుకుంటున్నారు. ఇప్పటి వరకు చాలా మంది క్రికెట్ ప్లేయర్స్ అండ్ బాలీవుడ్ హీరోయిన్స్ మధ్య ప్రేమాయణలు బాగానే సాగాయి.

ఒకప్పుడు షర్మిలా ఠాగూర్‌-మన్సూర్‌ అలీ పటౌడీ మరియు సంగీత బిజ్‌ లానీ-అజారుద్దీన్‌ ఇక ఇప్పుడు అనుష్క-విరాట్ కోహ్లీ వంటి వారు ప్రేమ పక్షుల్లా తెగ తిరిగేస్తున్నారు. కొంతమంది ఇలా డైరెక్ట్ గా ప్రేమ వ్యవహారంలో మునిగి తెలుతుంటే కొందరి ప్రేమలు మాత్రం రూమర్స్ తోనే ముగిసిపోతున్నాయి. అయితే ఇప్పుడు మరో క్రికెటర్ మరియు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రేమలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇండియన్ క్రికెట్ టీమ్ లోని ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ని పరిణితి చోప్రా క్లిన్ బౌల్డ్ చేసిందని కామెంట్స్ వినబడుతున్నాయి. ఎందుకంటే రీసెంట్ గా ట్విట్టర్ లో వారిద్దరూ కొన్ని కామెంట్స్ చేసుకున్నారు. ముందుగా పరిణితి ఓ సైకిల్ ఫోటోను పోస్ట్ చేసి.. అమేజింగ్ పార్టనర్‌తో ఫర్‌ఫెక్ట్ ప్రయాణం కోరుకుంటున్నట్లు... ఓ మెస్సేజ్ ఇచ్చింది.  దీంతో మరో కొన్ని క్షణాల్లోనే హార్దిక్ కూడా ఆ విషయంపై స్పందించాడు. అదేమిటంటే.. బహుశా ఇది బాలీవుడ్‌ క్రికెట్ లింకులో రెండోదేమో అంటూ ఓ రిప్లై ఇచ్చాడు. ఇక  పరిణితి భామ తను ఆన్సర్ ఇవ్వలేను అన్నట్టుగా ప్రవర్తించడంతో ఇక మీడియా ఉరుకుంటుందా?.. ఒకటికి పది లింకులను జోడించి మరో ఆటగాడి ని వలలో వేసుకున్న అందాల తార అని ప్రత్యేక కథనాలను ప్రసారం చేయడం మొదలు పెట్టారు.

డేటింగ్ కూడా నడుస్తోందని టాక్ రావడంతో పరిణితి చోప్రా ఓ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. జియోమీ కొత్త ఫోన్‌ 5ఎక్స్‌ ప్రచారంలో భాగంగానే తాను పార్టనర్‌ ట్వీట్‌ చేశానని చెప్పింది. కానీ ఎవ్వరు ఆమె మాటలు నమ్మకుండా.. హార్దిక్ పాండ్యా క్రికెట్ అండ్ బాలీవుడ్ అంటూ కామెంట్ చేయడం పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరీ వీరి ప్రేమ వ్యవహారం నిజమే కాదో తెలియాలంటే ఇద్దరు ఎక్కడో చోట ఫోటోలకు దొరకాల్సిందే.


Tags:    

Similar News