పొగ తాగిన పాండ్యా.. వీడియోలో దొరికాడా.?

Update: 2018-11-21 01:30 GMT
భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని భార్య సాక్షి జన్మదిన వేడుకలు ముంబైలో ఆదివారం అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి టీమిండియా క్రికెటర్ హార్ధిక్ పాండ్యా హాజరయ్యాడు. పాండ్యా గాయం కారణంగా ఆస్ట్రేలియా పర్యటనలకు వెళ్లలేకపోవడంతో ఈ వేడుకల్లో పాల్గొన్నారు. మిగతా క్రికెటర్లంతా ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉండడంతో హాజరు కాలేదు..

ధోని భార్య సాక్షి తాజాగా తన బర్త్ డే వేడుకల వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇది చూసిన నెటిజన్లు హార్ధిక్ పాండ్యా చేసిన పనికి సోషల్ మీడియాలో ఏకిపారేస్తున్నారు. పార్టీలో పాండ్యా తీరు సరికాదంటూ ట్రోల్స్ చేస్తున్నారు.

సాక్షి ధోని కేక్ కట్ చేస్తుండగా వెనుకాలే ఉన్న హార్ధిక్ పాండ్యా సిగరెట్ తాగి ఊదుతున్నట్టు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. వీడియోలో నిజంగానే పాండ్యా సిగరెట్ తాగాడా అనే విషయం తెలియాల్సి ఉంది. అయితే దీనిపై పాండ్యా మాత్రం ఇప్పటివరకు స్పందించలేదు.

వీడియో కోసం క్లిక్ చేయండి

Full View
Tags:    

Similar News