అవును.. ఆ హీరో ఏం చేస్తున్నాడు?

Update: 2017-08-23 13:56 GMT
తకిట తకిట సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచయం అయిన "హర్షవర్ధన్ రాణే" తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకోవడానికి బాగానే కష్టపడ్డాడు. అడపాదడపా క్యారెక్టర్ రోల్స్ చేస్తూ.. ఇండస్ట్రీ లో నిలదొక్కుకునే ప్రయత్నం చేశాడు. ఇక అవును సినిమాతో మనోడు కొంచెం పాపులర్ అయ్యాడు. ఇక ఫిదా సినిమాలో కూడా కాస్త మెరిసి ఒకే అనిపించాడు.

అయితే ప్రస్తుతం ఈ యువ నటుడు సినిమాలను తగ్గించేశాడు. సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ వస్తుండడంతో రూటును మార్చేసి ఇంకో విధంగా ప్రయత్నం చేస్తున్నాడు. ప్ ప్రముఖ ఛానల్ నిర్వహించే అడ్వెంచర్ ట్రావెల్ షో తో రాబోతున్నాడట. కొన్ని ప్రాముఖ్యత కలిగిన ప్రాంతాలను చూపించే క్రమంలో బైక్ పై వెళుతూ.. ఆ షో ను నడిపించాలట. దీంతో అందుకు హర్షవర్ధన్ కరెక్ట్ గా సెట్ అవుతాడని టివి యాజమాన్యం అతన్ని సెలక్ట్ చేసిందట.

ఇక హర్షవర్ధన్ కూడా ట్రావెలింగ్ అంటే తనకు ఎంతో ఇష్టమని చెబుతున్నాడు.. అద్భుతమైన ప్రదేశాలను వాటి వెనుక జరిగిన చరిత్రను ప్రేక్షకులకు అర్థమయ్యేలా చెప్పడనికి తన శక్తి మేరకు ప్రయత్నిస్తాడట. మరి ఆ ఛానల్ వివరాలు గాని షో వివరాలు గాని ఎంతవరకు ఈ హీరో బయటపెట్టలేదు. చూద్దాం ఎలా వస్తాడో.
Tags:    

Similar News