అలా కీర్తి బుగ్గ‌లు గిల్లేస్తే ఆయ‌న ఫీల‌వుతాడేమో!

వ‌రుణ్ ధావ‌న్ న‌టించిన `బేబి జాన్` ఈ నెల 24న అత్యంత గ్రాండ్ గా విడుద‌ల‌వుతున్న సంగ‌తి తెలిసిందే.

Update: 2024-12-24 03:53 GMT

వ‌రుణ్ ధావ‌న్ న‌టించిన `బేబి జాన్` ఈ నెల 24న అత్యంత గ్రాండ్ గా విడుద‌ల‌వుతున్న సంగ‌తి తెలిసిందే. భారీ అంచనాలున్న ఈ చిత్రం ట్రైల‌ర్ ఇంత‌కుముందే విడుదైలైంది. ఇందులో స‌స్పెన్స్ ఎలిమెంట్, వ‌రుణ్ ధావ‌న్ డిఫ‌రెంట్ గెట‌ప్పులు, జాకీ ష్రాఫ్ విల‌న్ పాత్ర ప్ర‌త్యేకంగా అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నాయి. ఇదిలా ఉంటే బేబి జాన్ ప్ర‌మోష‌న్స్ కోసం ధావ‌న్ తో క‌లిసి క‌థానాయిక‌లు కీర్తి సురేష్‌, వామిక గ‌బ్బి దేశ విదేశాల‌కు ప్ర‌యాణిస్తున్నారు.


ఇంత‌కుముందే వ‌రుణ్ ధావ‌న్ తో క‌లిసి దుబాయ్ లో కీర్తి సురేష్‌ ప్ర‌చారం నిర్వ‌హించింది. అక్క‌డి నుంచి కొన్ని ఫోటోల‌ను కూడా కీర్తి షేర్ చేయ‌గా వైర‌ల్ అయ్యాయి. తాజాగా బేబి జాన్ ప్ర‌మోష‌న్స్ నుంచి మ‌రికొన్ని కొత్త ఫోటోలు విడుద‌ల‌య్యాయి. ఈ ఫోటోగ్రాఫ్స్ లో వ‌రుణ్ ధావ‌న్ చాలా చిలిపిగా కీర్తి బుగ్గ‌లు ప‌ట్టుకుని గిల్లేస్తున్న ఫోటో వైర‌ల్ గా మారింది. కొత్త పెళ్లికూతురు కీర్తి మెడ‌లో ఆ తాళిబొట్టు ప్ర‌త్యేకంగా హైలైట్ అయిపోతోంది. కీర్తి సురేష్ పూర్తిగా అల్ట్రా మోడ్ర‌న్ డ్రెస్ ల‌లో క‌నిపిస్తోంది. కానీ ఆ మెడ‌లో ప‌సుపుతాడు ప్ర‌త్యేకంగా క‌నిపిస్తోంది..


కొత్త పెళ్లి కూతురు బుగ్గ‌లు గిల్లేస్తున్న చిలిపి హీరో వ‌రుణ్ ధావ‌న్ గురించి నెటిజ‌నులు సర‌దాగా వ్యాఖ్యానిస్తున్నారు. ఇది సినిమా ప్ర‌మోష‌నే అయినా కీర్తి హ‌బ్బీ ఆంటోని చూస్తే ఫీల‌వుతాడు క‌దా! అంటూ ఆట‌ప‌ట్టిస్తున్నారు. బేబి జాన్ ప్ర‌మోష‌న్స్ కోసం కీర్తి డెడికేష‌న్ కి అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోతున్నారు. పెళ్ల‌యిన వారంలోనే ఇలా సినిమా ప్ర‌మోష‌న్స్ కోసం కీర్తి వ‌చ్చేసింది. దీనికోసం త‌న హ‌నీమూన్ ని కూడా వాయిదా వేసుకుందని ముచ్చ‌టించుకుంటున్నారు.


బేబి జాన్ మొదటి రోజు చెప్పుకోద‌గ్గ వ‌సూళ్ల‌ను సాధించ‌బోతోంద‌ని ట్రేడ్ చెబుతోంది. ఈ చిత్రం భారతదేశం అంతటా ఘనమైన ఓపెనింగ్ ల‌తో ఆశాజనకమైన‌ సంకేతాలను పంపుతోంది. అడ్వాన్స్ బుకింగులు బావున్నాయి. అయితే మొద‌టి రోజు స‌మీక్ష‌లు, మౌత్ టాక్ ని బ‌ట్టి జ‌నం థియేట‌ర్ల వైపు వెళ్లే ఛాన్సుంది. పోటీబ‌రిలో పుష్ప 2 ఉంది గ‌నుక బేబి జాన్ పోరాటం ఎలా సాగుతుందో వేచి చూడాలి.

Tags:    

Similar News