హాలీవుడ్ లో ఇప్పుడు హాట్ హాట్ గా నడుస్తున్న చర్చల్లో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు హార్వే వైన్ స్టైన్. ఈ కామపిశాచి కంట్లో పడిన ఏ తార కూడా క్షేమంగా బతికి బట్టకట్టింది లేదు. ప్రముఖ నటీమణుల్ని సైతం వదలని హార్వే లీలలు తాజాగా బయటకు వచ్చి సంచలనం సృష్టిస్తున్నాయి. అమెరికాలో టాప్ నిర్మాతగా పేరున్న హార్వే ఏంజెలీనా జోలీ నుంచి ఎంతో మంది సినీతారల్ని లైంగిక వేధింపులకు గురి చేసిన వైనం బయటకు వచ్చింది.
అతగాడి కామపురాణం కవర్ పేజీ కథనంగా ప్రచురితం కావటం.. అతగాడు చేసిన దారుణాలను ఆధారాలతో సహా బయటపెట్టిన వైనం ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారటమే కాదు.. చివరికి అతగాడి పెళ్లాం సైతం చీ కొట్టి వెళ్లిపోయింది.
హార్వే కన్ను హాలీవుడ్ తారల మీదనే కాదు.. బాలీవుడ్ అగ్ర నటి మీద పడిందన్న విషయం తాజాగా బయటకు వచ్చింది. తన అందంతో అంతర్జాతీయంగా పలువురిని ఆకట్టుకున్న ఐశ్వర్యారాయ్ మీద కన్నేసిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది. పెళ్లి అయ్యాక.. ఐష్ జీవితాన్ని నాశనం చేయాలని భావించినట్లుగా ఆమెకు గతంలో మేనేజర్ గా పని చేసిన సిమోన్ షెఫీల్డ్ చెబుతోంది. ఐష్ ను హార్వే నుంచి తానే కాపాడినట్లుగా ఆమె చెబుతోంది.
ఎలా అన్న ప్రశ్నకు ఆమె చెబుతున్న సమాధానం ఏమిటంటే.. ఓసారి అమెరికాలో నిర్వహించిన ఆంఫార్ గాలాకు ఐష్ తన భర్త అభిషేక్ బచ్చన్ తో కలిసి వెళ్లిందని.. అక్కడ వీరిద్దరూ హార్వేతో కలిసి ఫోటో కూడా దిగారని చెప్పింది. ఐష్ ను చూసిన హార్వే.. ఆమెతో తనకు వ్యక్తిగతంగా సమావేశం ఏర్పాటు చేయాలని తనను బ్రతిమిలాడినట్లుగా ఆమె చెప్పింది. అయితే అందుకు తాను ఒప్పుకోలేదన్న సిమోన్.. ఆ సందర్భంలోహార్వే నుంచి తనకు వార్నింగ్ లు కూడా వచ్చినట్లుగా తాజా ఇంటర్వ్యూలో పేర్కొంది.
ఐష్ వృత్తికి సంబంధించిన అన్ని విషయాల్ని తానే చూసుకునేదానినని.. ఐష్ ను వ్యక్తిగతంగా కలవాలని హార్వే తనను తరచూ వేడుకునేవాడని.. పశువులా ప్రవర్తించేవాడు కూడానని చెప్పింది. ఒకసారి తాను.. ఐష్ అతని ఆఫీస్ నుంచి బయటకు వచ్చినప్పుడు.. తనను పక్కకు తీసుకెళ్లి బెదిరించినట్లుగా వెల్లడించింది. అయితే.. తాను భయపడలేదని.. ఐష్ ఛాయలకుఅతన్ని రానివ్వకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లుగా పేర్కొంది.సిమోన్ మాటలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.