తమిళ యంగ్ స్టార్ హీరో ఆర్య మరియు హీరోయిన్ సాహేషా సైగల్ త్వరలో ఒక్కటి కాబోతున్న విషయం తెల్సిందే. వీరిద్దరు గత కొన్ని రోజులుగా ప్రేమలో ఉన్నారు. వీరి ప్రేమకు ఇరు కుటుంబాల పెద్దలు ఓకే చెప్పడంతో పాటు పెళ్లికి ఏర్పాట్లు కూడా మొదలు పెట్టారు. ఇటీవలే వీరి పెళ్లికి మార్చి 9, 2019 అంటూ ముహూర్తం ఫిక్స్ చేశారు. పెళ్లి పనులు మొదలు పెట్టారు. ఆర్య ప్రస్తుతం పెళ్లి కార్డులు పంచుతూ బిజీ అయ్యాడు. తాజాగా హీరో విశాల్ కు ఆర్య పెళ్లి కార్డు ఇచ్చాడు.
ఆర్య, సాహేషాల వివాహం హైదరాబాద్ లోని ఒక ప్రముఖ హోటల్ లో జరుగబోతున్నట్లుగా తెలుస్తోంది. ముంబయికి చెందిన సాహేషా, చెన్నైకి చెందిన ఆర్యల పెళ్లి మద్యలో హైదరాబాద్ లో నిర్వహించడంకు గల కారణం ఏంటా అంటూ ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తమిళ సినీ రంగ ప్రముఖులు ఎంతో మంది హాజరు అయ్యే వివాహంను హైదరాబాద్ లో నిర్వహించనున్న నేపథ్యంలో వారి పెళ్లి రోజు ఇక్కడ సందడి నెలకొననుంది.
పెళ్లి తర్వాత రోజు లేదంటే రెండవ రోజు చెన్నైలో భారీ ఎత్తున రిసెప్షన్ ను కూడా ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్ లో వీరి పెళ్లి జరుగనున్న నేపథ్యంలో టాలీవుడ్ కు చెందిన ప్రముఖులు కూడా హాజరు అయ్యే అవకాశం ఉంది. ఆది పలు తెలుగు సినిమాల్లో నటించాడు. అల్లు అర్జున్ నటించిన 'వరుడు' చిత్రంలో ఆర్య విలన్ గా నటించిన విషయం తెల్సిందే.
ఆర్య పెళ్లి పత్రికలు ఇవ్వడం మొదలు పెట్టి మొదటి కార్డ్ ను విశాల్ కు ఇచ్చిన నేపథ్యంలో ఆ ఫొటోను విశాల్ షేర్ చేసి.. నాకు ఎంతో ఆప్తుడు, హృదయానికి దగ్గరైన వాడు అయిన ఆర్య పెళ్లి చేసుకోబోతున్న సందర్బంగా చాలా సంతోషంగా ఉంది, అతడి జీవితం సంతోషంగా ఉండాలంటూ ఆశిస్తూ విశాల్ శుభాకాంక్షలు చెప్పాడు.