బాలీవుడ్ లో ఈ మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన అతి పెద్ద సినిమా లాల్ సింగ్ చడ్డా. దాదాపుగా రెండు వందల కోటల రూపాయల బడ్జెట్ తో సినిమాను రూపొందించినట్లుగా బాలీవుడ్ మీడియాలో కథనాలు వచ్చాయి. సినిమా విడుదల అయ్యి వెయ్యి కోట్లు సాధిస్తుంది... వందల కోట్ల రూపాయలు నిర్మాతకు మరియు హీరోకు లాభాలు ఖాయం అంటూ విడుదలకు ముందు బాలీవుడ్ మేకర్స్ భావించారు.
కానీ అనుకున్నది ఒక్కటి.. అయినది మరొకటి. లాల్ సింగ్ చడ్డా దేశ వ్యాప్తంగా విడుదల అయ్యి అత్యంత దారుణమైన పరాజయం ను మూట కట్టుకుంది. కనీసం 50 కోట్ల వసూళ్లను కూడా ఈ సినిమా రాబట్టలేకపోయింది. దేశంలో ఎక్కడ చూసినా కూడా లాల్ సింగ్ చడ్డా కు వ్యతిరేక పవనాలు వీచాయి. దాంతో సినిమా పూర్తిగా నిరాశ పర్చింది.
సినిమా నిర్మాత దారుణమైన నష్టాలు చవి చూడాల్సిన పరిస్థితి.. ఈ సమయంలో నిర్మాత ని డిస్ట్రిబ్యూటర్లు తమకు న్యాయం చేయాలంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారని మీడియాలో పుకార్లు షికార్లు చేశాయి. ఆ సమయంలోనే నిర్మాత స్పందిస్తూ సినిమా ఇంకా థియేటర్లలో ఆడుతోంది. విదేశాల్లో మంచి వసూళ్లను ఈ సినిమా రాబడుతోంది. మాకు ఈ సినిమా తో నష్టం ఏమీ లేదు అంటున్నారు.
మా సినిమా ను స్వయంగా మేము పంపిణీ చేసుకున్నాం. కనుక బయ్యర్ల నష్టాలకు అసలు ఛాన్స్ లేదని మాకు ఎలాంటి ఇబ్బంది లేదు అన్నట్లుగా నిర్మాత పేర్కొన్నాడు.
తాజాగా మరో ఆసక్తికర ప్రచారం బాలీవుడ్ లో జరుగుతోంది. నిర్మాతలు ఈ సినిమా వల్ల భారీ మొత్తంను నష్టపోవడంతో ఆమీర్ ఖాన్ ఏకంగా 50 కోట్ల రూపాయలు తన పారితోషికంను వెనక్కు ఇచ్చాడట.
తెలుగు లో లాల్ సింగ్ చడ్డా ను మెగాస్టార్ చిరంజీవి సమర్పించాడు. అయినా కూడా కనీసం బజ్ క్రియేట్ అవ్వలేదు. సరే విడుదల తర్వాత సందడి చేస్తుంది అనుకుంటే పరిస్థితి దారుణంగా మారింది. మొత్తానికి బాలీవుడ్ నుండి వస్తున్న చిన్నా పెద్ద సినిమాల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. 50 కోట్ల బడ్జెట్ తో సినిమాలను చేస్తేనే కాస్త సేఫ్ ప్రాజెక్ట్ లుగా అవి నిలుస్తున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.