సాహో బడ్జెట్: అనుకున్నదొకటి... అయినదొకటి

Update: 2019-08-27 01:30 GMT
బాహుబలి లాంటి అద్భుతమైన హిట్ తర్వాత ప్రభాస్ మీద ఎలాంటి అంచనాలు ఉన్నాయో అందరికీ తెలుసు. ఓ భారీ రేంజ్ లో అభిమానులు, ప్రేక్షకులు ప్రభాస్ నెక్ట్స్‌ సినిమా కోసం ఎదురు చూశారు. ఆ అంచనాలకు తగిన విధంగానే ప్రభాస్ తన నెక్ట్స్‌ సినిమా సాహోతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సుజిత్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఆగష్టు 30న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలవుతుంది.

అయితే ఈ సినిమా బడ్జెట్ ఎంత అయిందో ఈ మధ్య ప్రభాస్ అనేక సందర్భాల్లో వెల్లడించాడు. తాజాగా కూడా మూవీ ప్రమోషన్లో భాగంగా ఈ చిత్రానికి రూ. 350 కోట్లు ఖర్చు పెట్టినట్లు ప్రభాస్ తెలిపాడు. కానీ ఇంత భారీగా ఖర్చు అవ్వడానికి గల కారణాలని కూడా ప్రభాస్ వివరించాడు. అసలు ముందు ఈ సినిమాని రూ. 150 కోట్ల బడ్జెట్ తో ముగిద్దామని చిత్ర యూనిట్ భావించారట. అలాగే సంవత్సరంన్నరలోనే షూటింగ్ పూర్తి చేయాలనుకునే ప్లాన్ చేసుకున్నారట.

కానీ బాహుబలి తర్వాత మంచి యాక్షన్ సినిమా తీయాలనే రూ. 150 కోట్లు అనుకున్నారట. లేదంటేరూ. 70-80 కోట్లలో తీసేసేవాళ్లంట. కానీ ఇప్పుడు 150 దాటేసుకుని 350 కోట్ల‌కు వెళ్లడానికి కారణం గ్రాఫిక్స్, మల్టీ లాంగ్వేజ్ అవ్వడం వల్లే బడ్జెట్ పెరిగిందని ప్రభాస్ చెబుతున్నాడు. మెయిన్ యాక్షన్ ఎపిసోడ్స్ లో సీజీ వర్క్ వల్ల బడ్జెట్ తెలియకుండా పెరుగుతూ వచ్చిందని చెప్పారు.

కాకపోతే బడ్జెట్ పెరిగిన నిర్మాతలు ఎక్కడ వెనుకాడలేదంట.  పైగా బాలీవుడ్ స్టార్స్ ఉండటం వల్ల కూడ కొంత ఖర్చు పెరిగింది. ఇక దర్శకుడు సుజిత్ తీసింది ఒక సినిమా అయినా తన కథలో ఉన్న బలం వల్లే సినిమా చేయడానికి ఒప్పుకున్నాని ప్రభాస్ చెప్పాడు. మొత్తానికి సాహో బడ్జెట్ మొదటి ఒకటి అనుకుంటే...తర్వాత ఇంకొకటి అయింది.
Tags:    

Similar News