సాహో నుంచి పక్కకొస్తున్న డార్లింగ్

Update: 2019-03-19 07:20 GMT
బాహుబలి ప్రభావమో ఇంకేదైనా కారణమో చెప్పలేం కాని కనీసం రెండేళ్ళు గ్యాప్ లేనిదే ప్రభాస్ సినిమాలు రాని పరిస్థితి నెలకొనడం డార్లింగ్ ఫ్యాన్స్ కి సంకటంగా మారింది. అవతల ఇతర హీరోలందరూ ఏడాదికి ఒకటి రెండు చేసుకుంటూ దూసుకుపోతు ఉంటే బడ్జెట్ కాన్వాస్ అంటూ భారీ ప్రాజెక్ట్స్ లో ప్రభాస్ ఇంత లేట్ గా వస్తుండటం పట్ల కొంత అసంతృప్తి అయితే నెలకొంది. సాహో ఆగస్ట్ 15 విడుదల అన్నారు కాబట్టి కొంత రిలాక్స్ అయ్యారు కాని లేదంటే అసహనం ఇంకా పెరిగిపోయేది. మెల్లగా ఇది కొలిక్కి వస్తున్న మాటైతే నిజం.

ఒక్కొక్కరు తమ పోర్షన్లు పూర్తి చేసుకుని టీం కు సెలవు చెప్పేస్తున్నారు. తమిళ నటుడు అరుణ్ విజయ్ మొన్నే ఫేర్ వెల్ తీసుకున్నాడు. ఇదిలా ఉండగా సాహో సెట్స్ లో ఉన్నప్పుడే షూటింగ్ మొదలుపెట్టుకున్న మరో సినిమా ఇప్పుడు లైన్ లోకి రాబోతోంది. జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో యువితో పాటు కృష్ణంరాజు గారి గోపికృష్ణ బ్యానర్ సంయక్తంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే

తాజా సమాచారం మేరకు ఈ గురువారం నుంచే దీని షెడ్యూల్ హైదరాబాద్ లో ప్రారంభం కాబోతోంది. రెండు వారాలకు పైగా ఏకదాటిగా కీలకమైన సన్నివేశాలు చిత్రీకరిస్తారు. ఇప్పటికే దీని కోసం ప్రత్యేకంగా ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ రెడ్డి నేతృత్వంలో సెటింగ్స్ వేశారు. ఇందులో కీలక తారాగణంతో పాటు హీరొయిన్ పూజా హెగ్డే కూడా పాల్గొంటుంది. ఆ తర్వాత చిన్న బ్రేక్ తీసుకుని సాహో బాలన్స్ వర్క్ లో జాయిన్ అవుతాడు ప్రభాస్.

అది పూర్తయ్యాక రాధాకృష్ణ టీం లాంగ్ షెడ్యూల్ కోసం యురప్ వెళ్ళిపోతుంది. ఈ ఏడాది సాహో వచ్చే సంవత్సరం రాధాకృష్ణ సినిమా వస్తుందన్న అంచనాలో అభిమానులు ఉన్నారు. సాహో ఎలాగూ లేట్ అయ్యింది కాని కనీసం ఈ మూవీ అయినా టైం కు ఫినిష్ అయితే ఆ కోరిక తీరడం కష్టం కాదు
    

Tags:    

Similar News