మేకింగ్‌ వీడియోతో పిచెక్కిస్తున్న చియాన్‌

Update: 2019-04-17 10:43 GMT
తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా మంచి స్టార్‌ డం ఉన్న హీరో విక్రమ్‌. ఎన్నో అద్బుతమైన పాత్రలను పోషించిన విక్రమ్‌ ప్రస్తుతం 'కడరమ్‌ కొండన్‌' అనే చిత్రంలో నటిస్తున్నాడు. తన ప్రతి సినిమాలో కూడా విభిన్నమైన గెటప్‌ లో కనిపించాలని ఆశ పడే విక్రమ్‌ ఈ చిత్రంలో కూడా చాలా స్టైలిష్‌ గా కనిపించబోతున్నాడు. ఈ చిత్రంను కమల్‌ హాసన్‌ తన రాజ్‌ కమల్‌ ప్రొడక్షన్స్‌ పై నిర్మిస్తున్న కారణంగా అంచనాలు రెట్టింపు స్థాయిలో ఉన్నాయి.

విక్రమ్‌ బర్త్‌ డే సందర్బంగా 'కడరమ్‌ కొండన్‌' చిత్రానికి సంబంధించిన మేకింగ్‌ వీడియోను విడుదల చేశారు. మేకింగ్‌ వీడియోలో విక్రమ్‌ గెటప్స్‌ రివీల్‌ చేయడం జరిగింది. చాలా స్టైలిష్‌ గా విక్రమ్‌ కనిపించబోతున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెప్పకనే చెప్పారు. రాజేష్‌ ఎం సెల్వ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌ తో రూపొందుతున్న ఈ చిత్రంలోని విక్రమ్‌ లుక్‌ రివీల్‌ అవ్వడంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరుగుతున్నాయి. 53వ సంవత్సరంలో అడుగు పెట్టబోతున్న కూడా విక్రమ్‌ ఇంకా మూడు పదుల వయసు యువకుడు చేసినట్లుగా సాహసాలు చేయడం అందరిని ఆశ్చర్య పర్చుతోంది.

ఈ చిత్రంలో పోలీస్‌ ఆఫీసర్‌ గా విక్రమ్‌ కనిపించనున్నాడు. విక్రమ్‌ కెరీర్‌ లో ఇది మరో విభిన్నమైన చిత్రంగా నిలుస్తుందనే నమ్మకంను చిత్ర యూనిట్‌ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. మేకింగ్‌ వీడియోతో ఫ్యాన్స్‌ ను విక్రమ్‌ పిచెక్కిస్తున్నాడు. ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా అంటూ ఇప్పటి నుండే ఫ్యాన్స్‌ మరియు ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంలో కమల్‌ చిన్న కూతురు అక్షర హాసన్‌ హీరోయిన్‌ గా నటిస్తోంది. పూజా కుమార్‌ మరో హీరోయిన్‌ గా కనిపించబోతుంది. అక్షర హాసన్‌ కమర్షియల్‌ సక్సెస్‌ కోసం చాలా కాలంగా ఎదురు చూస్తోంది. ఈ చిత్రంతో అక్షర హాసన్‌ కు ఆ సక్సెస్‌ దక్కడం ఖాయంగా సినీ వర్గాల వారు అంటున్నారు.


For Video Click Here

Tags:    

Similar News