నాటి హీరో.. హ‌త్యాయ‌త్నం కింద అరెస్ట్‌!

Update: 2015-11-17 08:51 GMT
తెలుగు.. క‌న్న‌డ‌.. త‌మిళ చిత్రాల్లో హీరోగా న‌టించి.. పేరు ప్ర‌ఖ్యాతులు తెచ్చుకున్న న‌టుడు వినోద్ కుమార్‌. తొలుత విల‌న్ గా.. ఆ త‌ర్వాత హీరోగా సుప‌రిచితుడైన వినోద్ కుమార్ గ‌తంలో ఒక వెలుగు వెలిగారు. టాప్ హీరో కాకున్నా.. త‌న‌వైన కొన్ని చిత్రాల్లో న‌టించారు.

మూడు రాష్ట్రాల సినీ ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితుడైన వినోద్ కుమార్‌ ను తాజాగా క‌ర్ణాట‌క పోలీసులు అరెస్ట్ చేశారు. ప్ర‌స్తుతం ఆయ‌న ఒక హ‌త్యాయ‌త్నం కేసులో ఇరుక్కున్నారు. త‌న ఆర్థిక వ్య‌వ‌హారాల్ని చూసే వ్య‌క్తిగ‌త మేనేజ‌ర్ పై హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డిన‌ట్లుగా తెలుస్తోంది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు అంద‌టం.. దీనిపై విచారించిన పోలీసులు ఆయ‌న నేరాన్ని చేసి ఉంటార‌న్న ఆధారాలు ల‌భించాయ‌ని చెబుతున్నారు. వినోద్ కుమార్ కు సంబంధించిన ఆర్థిక లావాదేవీల విష‌యంలో స‌ద‌రు మేనేజ‌ర్ అవ‌క‌త‌వ‌క‌ల‌కు పాల్ప‌డ్డార‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

అత‌గాడు చేసిన మోసానికి ఆగ్ర‌హానికి గురై.. హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డిన‌ట్లుగా భావిస్తున్నారు. పోలీసుల‌కు అందిన ఫిర్యాదుతో నాటి హీరో వినోద్ కుమార్ ను క‌ర్ణాట‌క పోలీసులు ఆయ‌న స్వ‌గ్రామ‌మైన ఈశ్వ‌ర మంగ‌ల (ద‌క్షిణ క‌ర్ణాట‌క ప్రాంతం)లో పోలీసులు అదుపులోకి తీసుకున్న‌ట్లు చెబుతున్నారు.
Tags:    

Similar News