సీనియర్ హీరోకి బయపడి సిగరెట్ మానేసిన హీరోయిన్..!

Update: 2022-11-11 09:30 GMT
టాలీవుడ్ లో చాలామంది హీరో హీరోయిన్లకు స్మోకింగ్ - డ్రింకింగ్ వంటి హ్యాబిట్స్ ఉన్నాయి. వారిలో కొందరు చైన్ స్మోకర్స్ కూడా ఉన్నారు. షూటింగ్ సమయంలో కాస్త బ్రేక్ దొరికినా.. ఆ పక్కకి వెళ్ళి లేదా కార్వాన్ లోకి వెళ్ళో దమ్ముకొట్టేసి వస్తుంటారు.

బీడీలు తాగండి బాబులు.. తాగి స్వర్గాన్ని తాకండి బాబులు అని ఓ సినిమాలో చెప్పినట్లు.. పొగ తాగుతూ ఆనందిస్తుంటారు. మరికొందరు ఒత్తిడి నుంచి బయటపడటానికి పొగ తాగడాన్ని మార్గంగా భావిస్తుంటారు. ఎవరిష్టం వాళ్ళది.. ఎవరి అలవాట్లు వాళ్ళకి ఉంటాయి కాబట్టి.. దానిపై మనం ఏం అనలేం.

కానీ వారి అలవాట్ల వల్ల ఇతరులు ఇబ్బంది పడితేనే సమస్య వస్తుంది. ఇప్పుడు అసలు విషయంలోకి వస్తే.. ఓ స్టార్ హీరోయిన్ కి సిగరేట్ తాగే అలవాటు ఉంది. టాలీవుడ్ స్టార్ హీరోల దగ్గర నుంచి కుర్ర హీరోల వరకూ అందరితో సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

కొన్నేళ్లు సినిమాలకు దూరంగా ఉన్న ముద్దుగుమ్మ.. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన వరుస సినిమాలు.. బ్యాక్ టూ బ్యాక్ హిట్లతో అదరగొడుతోంది. నిజానికి ఆమె స్మోకర్ అనే విషయం కలిసి పని చేసిన వారందరికీ తెలుసు. గతంలో సినిమా సెట్స్‌ లో.. కార్వాన్‌ లోనే ఎక్కువగా స్మోక్ చేసేది.

కానీ ఇప్పుడు ఆ హీరోయిన్ పొగ తాగడం లేదట. గ్యాప్ దొరికితే ఎప్పుడూ లొకేషన్ లో సిగరెట్ తాగుతూ కనిపించే ఆమె.. స్మోకింగ్ చేయడం లేదేంటి అని తోటి నటీనటులు ఆలోచిస్తున్నారట. అయితే దీని వెనుక ఓ సీనియర్ హీరో ఉన్నాడని టాక్ వినిపిస్తోంది.

ప్రస్తుతం ఈ బ్యూటీ ఓ సీనియర్ స్టార్ హీరోతో సినిమా చేస్తోంది. ఆమెకున్న దూమపానం అలవాటు వల్ల అతనికి ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. ఇద్దరి మధ్య రొమాంటిక్ సీన్స్ లేదా ఒకరికొకరు దగ్గరగా ఉండి నటించాల్సిన సన్నివేశాల చిత్రీకరణలో పొగ వాసన కారణంగా అసౌకర్యంగా ఫీల్ అవుతారు.

సిగరెట్ తాగడం సహజమని భావించి.. ఇప్పటి వరకూ ఆమెతో స్క్రీన్ షేర్ చేసుకున్న హీరోలందరూ ఎలాగొలా సర్దిచెప్పుకొని షూటింగ్స్ చేసారు. కానీ ఇప్పుడు ఆమె నటిస్తోంది ఓ సీనియర్ హీరోతో. కొంచం తేడా వచ్చినా సమస్య కొని తెచ్చుకున్నట్లే.

ఇవన్నీ ఆలోచించే ఆ హీరోయిన్ పొగ తాగడం ఆపేసి ఉండొచ్చని కోయాక్టర్స్ భావిస్తున్నారట. ఆమె నిజంగానే ఈ కారణం చేతనే ప్రస్తుతానికి సిగరెట్ తాగడం మానేసిందా లేక పొగ తాగడం ఆరోగ్యానికి హానికరమని తెలుసుకొని మొత్తానికి స్మోకింగ్ మానేసిందా అనేది తెలియదు కానీ.. దీని వల్ల మిగతా ఆర్టిస్ట్స్ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటున్నారట.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News