హీరోయిన్లు బొట బొటా ఏడ్చారు

Update: 2015-09-03 07:35 GMT
ఆడాళ్లు సెన్సిటివ్‌. చిన్న చిన్న విష‌యాల్ని కూడా త‌ట్టుకోలేరు. ఇట్టే క‌న్నీళ్లొచ్చేస్తాయి. అయితే ఒక్కోసారి ఎమోష‌న‌ల్ డ్రైవ్‌లో బైటికే ఏడ్చేస్తుంటారు. అప్ప‌ట్లో శ్రీ‌రామ‌రాజ్యం సినిమా గుమ్మ‌డికాయ కార్య‌క్ర‌మంలో న‌య‌న‌తార ఏడ్చేసింది. ఇక సినిమాకి సెల‌వ్‌. గుడ్‌బాయ్ .. అంటూ బొట బొటా క‌న్నీరు కార్చేసింది. అయితే ప్ర‌భుదేవాని పెళ్లాడి సంసార జీవ‌నంలో ప‌డిపోతాన‌నే బెంగ‌తోనే ఆ ప‌ని చేసింది. కానీ త‌ర్వాత సీను రివ‌ర్స‌య్యి మ‌ళ్లీ సినిమాల్లోకొచ్చింది అది వేరే క‌థ‌. ఇక పోతే... సౌత్‌ హీరోయిన్ స‌మంత‌, బాలీవుడ్ హీరోయిన్ క‌త్రిన విష‌యంలోనూ ఇలాంటి ఎమోష‌న్ ఉంది. క‌న్నీళ్లు కార్చిన సంద‌ర్భాలున్నాయి..

చెన్నై సోయ‌గం స‌మంత ఇప్ప‌టికే చాలా సినిమాల్లో న‌టించింది. దాదాపు సినిమాలంటే బోర్ అనే ఫీల్‌ తో ఉందిప్పుడు. ఇటీవ‌ల ఓ సంద‌ర్భంలో రొటీన్ క్యారెక్ట‌ర్ లు పోషించి బోర్ కొడుతోంది... సినిమాల‌కు బైబై చెప్తేస్తాన‌ని కూడా ప్ర‌క‌టించింది. అయితే ఇంత సీనియ‌ర్ న‌టి ఓ త‌మిళ సినిమా విష‌యంలో క‌న్నీటి ప‌ర్యంతం చెందాల్సి వ‌చ్చింది. ప్ర‌స్తుతం ఈ భామ విక్ర‌మ్ స‌ర‌స‌న 10 ఎంద్రాకుళ అనే సినిమాలో న‌టిస్తోంది. ఇటీవ‌ల సినిమా షూటింగ్  పూర్తైంది. చివ‌రి రోజు యూనిట్ అంతా సెట్ లో పార్టీ కూడా ఏర్పాటు చేసుకున్నారు. టీమంతా ఆనంద హేళ‌లో మునిగి తేలుతుంటే స‌మంత మాత్రం బోరున విల‌పించింద‌ట‌.

విష‌యం ఏంట‌ని ఆరా తీస్తే... యూనిట్ తో త‌న‌కున్న అనుబంధం ఈరోజుతో ముగిసి పోతుంది. రేప‌టి నుంచి మీరెవ్వ‌రు నాకు క‌నిపించ‌రు.. అందుకే క‌న్నీళ్లు వ‌చ్చేశాయ‌ని బ‌ధులిచ్చింద‌ట‌. ఇప్ప‌టివ‌ర‌కూ చాలా సినిమాల్లో న‌టించాను గానీ ఏ టీమ్ తోనే ఇంత క‌లుపుగోలుగా లేన‌ని చెప్పుకొచ్చింద‌ట‌.

ఆ మ‌ధ్య ఓ సినిమా సెట్ లో క‌త్రినా కైఫ్ కూడా ఇలాగే ఏడ్చింది. కానీ ఆమె టీమ్ లో ఒక‌ర్తే కాదు. కేవ‌లం ప్రియుడు ర‌ణ‌బీర్ క‌పూర్ పై అనుమానంతో అక్క‌డికి వ‌చ్చి... హీరోయిన్ దీపిక ప‌దుకొనేపై చిర్రుబొర్రులాడి క‌న్నీళ్లు పెట్టుకుని వెళ్లిపోయింది.
Tags:    

Similar News