'అలవైకుంఠపురంలో' హిందీ రీమేక్ క్రేజీ అప్డేట్..!

Update: 2021-06-20 06:58 GMT
సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం రీమేక్స్ హవా కొనసాగుతూనే ఉంది. ఒక ఇండస్ట్రీలో సూపర్ హిట్ అయినటువంటి సినిమాలను మరో భాషలో వెంటనే రీమేక్ చేసేస్తున్నారు మేకర్స్. అలా టాలీవుడ్ నుండి ప్రస్తుతం చాలా సినిమాలు బాలీవుడ్ ఇండస్ట్రీలో రీమేక్ అవుతున్నాయి. ఆ లిస్టులో ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'అలవైకుంఠపురంలో' సినిమా కూడా ఉంది. అయితే ఆల్రెడీ ఎప్పుడెప్పుడు షూటింగ్ ప్రారంభం చేద్దాం అనే దశలో ఉంది ఈ రీమేక్ స్క్రిప్ట్. దర్శకుడు డేవిడ్ ధావన్ ఆల్రెడీ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ పనులు మొత్తం పూర్తి చేసాడట.

ప్రస్తుతం సినిమాలో నటినటుల ఎంపిక జరుగుతుంది. ఆల్రెడీ అలవైకుంఠపురంలో నటించిన అల్లు అర్జున్ - పూజాహెగ్డే పాత్రల్లో బాలీవుడ్ యంగ్ స్టార్స్ కార్తీక్ ఆర్యన్ - కృతిసనన్ ఎంపికయ్యారు. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో హీరో తల్లి క్యారెక్టర్ కోసం యాక్టర్ ను వెతుకుతున్నారు మేకర్స్. తెలుగులో టబు పోషించిన క్యారెక్టర్ హిందీలో ఎవరు చేస్తారనే ఆసక్తి నెలకొంది. అయితే ఆ పాత్రలో ప్రస్తుతం సీనియర్ బ్యూటీ మనీషా కోయిరాల ఓకే అయినట్లు తెలుస్తుంది. బాలీవుడ్ కథనాల ప్రకారం.. ఆ క్యారెక్టర్ కోసం ఒరిజినల్ పోషించిన టబునే సంప్రదించారట.

కానీ ఆమె ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉండేసరికి మరో యాక్టర్ దగ్గరకు వెళ్లకతప్పలేదని టాక్. అయితే మొత్తానికి మనీషా కోయిరాలతో దర్శకనిర్మాతలు చర్చలు జరిపారట. ఆమె నుండి రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే ఆల్రెడీ మనీషా కోయిరాల ఓకే అయినట్లు ప్రొడ్యూసర్ ఏక్తాకపూర్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా పై అధికారిక ప్రకటన రాబోతుంది. ఈ సినిమాను బాలీవుడ్ లో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తో పాటు బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ నిర్మించనున్నట్లు సమాచారం. అయితే ఇదివరకు కార్తీక్ ఆర్యన్ - కృతిసనన్ కలిసి లుక్కాచుప్పి సినిమాలో నటించారు. చూడాలి మరి ఈసారి ఈ కాంబినేషన్ సెకండ్ హిట్ అందుకుంటారేమో!
Tags:    

Similar News