నయనతార టైటిల్ రోల్ లో రూపొందిన తమిళ మూవీ మూకుత్తి అమ్మన్ సినిమాను దీపావళి కానుకగా ఈనెల 14న హాట్ స్టార్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. సినిమా థియేటర్లు లేని కారణంగా డైరెక్ట్ ఓటీటీలో విడుదల చేయాలని నిర్ణయానికి వచ్చారు. ఈ విషయమై ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది. సినిమా ట్రైలర్ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మూకుత్తి అమ్మన్ ను తెలుగులో అమ్మోరు తల్లి అనే టైటిల్ తో విడుదల చేయబోతున్నారు. తమిళం మరియు తెలుగు ట్రైలర్ లకు మంచి స్పందన వచ్చింది.
ఎంటర్ టైన్ మెంట్ తో పాటు మంచి మెసేజ్ ను కూడా ఈ సినిమాలో చూపించబోతున్నట్లుగా ట్రైలర్ ను చూస్తే అర్థం అవుతుంది. అమ్మోరు తల్లిని కాస్త కామెడీ యాంగిల్ లో చూపించి ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసేందుకు మేకర్స్ ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో కొందరు హిందూ సంఘాల వారు ఈ సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ట్రైలర్ లో చూపించిన కొన్ని సీన్స్ హిందువుల మనోభావాలను దెబ్బ తీసేలా ఉన్నాయి అంటూ ఆరోపిస్తున్నారు. వెంటనే ఆ సినిమాలోని హిందువుల మనోభావాలు దెబ్బతీసే సీన్స్ ను తొలగించాలని లేదంటే సినిమాను అడ్డుకుంటాం అంటూ బ్యాన్ చేయాలంటూ ఆందోళన చేస్తాం అంటూ హెచ్చరించారు. మరి ఈ విషయమై చిత్ర యూనిట్ సభ్యులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.