ట్రైలర్ టాక్: పునర్జన్మ తికమక కామెడీ

Update: 2019-09-27 11:00 GMT
బాలీవుడ్ లో కామెడీ జోనర్ లో సినిమాలు తక్కువగానే వస్తాయి కానీ అవి దాదాపుగా మల్టిస్టారర్ ఫిలిమ్స్ అయి ఉంటాయి. ఇక మన టాలీవుడ్ కామెడీకి బాలీవుడ్ కామెడీకి ఒక తేడా ఉంటుంది. మన కామెడీ కాస్త సున్నితంగా ఉంటుంది.. అయితే వారి కామెడీ మాత్రం లౌడ్ గా ఉంటుంది. అలాంటి లౌడ్ కామెడీతో బాలీవుడ్ లో తెరకెక్కిన చిత్రం 'హౌస్ ఫుల్ 4'.  టైటిల్ కు తగ్గట్టే ఈ సినిమాలో చాలామంది లీడ్ యాక్టర్స్ ఉన్నారు.. ఇది హౌస్ ఫుల్ సీరీస్ లో నాలుగో చిత్రం. అక్షయ్ కుమార్.. రితేష్ దేశ్ ముఖ్.. బాబీ డియోల్.. కృతి సనన్.. పూజా హెగ్డే.. కృతి కర్బందా ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు. ఒక మన టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి ఒక ప్రత్యేక పాత్రలో నటించాడు.

ఈ సినిమా ట్రైలర్ కాసేపటి క్రితమే రిలీజ్ అయింది. "చరిత్ర ఒక్కోసారి పునరావృతం అవుతుందని అంటూ ఉంటారు" అనే అక్షయ్ కుమార్ డైలాగ్ తో స్టార్ట్ అవుతుంది ట్రైలర్.  అది 1419 వ సంవత్సరం.. సీతంగఢ్. అంటూ ఒక విజువల్ చూపిస్తారు.  అంటే సరిగ్గా 600 ఏళ్ళ క్రితం.  అప్పట్లో హౌస్ ఫుల్ లీడ్ యాక్టర్స్ అందరూ రాజకుమారులుగా.. యువరాణులుగా ఉంటారు.  కట్ చేస్తే వారే మళ్ళీ ఇప్పుడు 2019 లో పుడతారు.. అప్పుడు వారికి ఎదురైన పరిస్థితులే ఎదురవుతాయి. ఇక అక్షయ్ ఈ కథ ఇంట్రో ను ఎండ్ చేస్తూ 'నాకు ఏమనిపిస్తుందంటే.. అప్పుడూ నాకు పగిలింది..ఇప్పుడూ పగులుతుంది" అంటూ తన భయాన్ని వెల్లడిస్తాడు.  ఈ ఆరు వందల ఏళ్ళ పునర్జన్మ అనగానే మీకు వెంటనే మగధీర గుర్తుకు రావచ్చు.  అక్కడ 400 అయితే ఇక్కడ 600.  ఈ సినిమాకు చారిత్రాత్మక పునర్జన్మ కామెడీ అని టైటిల్ కూడా ఇచ్చారు.

రాజకుమారుడి దుస్తుల్లో ఉన్న రితేష్ తన ప్యాంట్ నుంచి పొడవాటి కత్తి తీయడం.. షాక్ అయిన అక్షయ్ 'ఔర్ క్యా క్యా ఛుపా రఖా హై ఉధర్" అడగడం లాంటి బోల్డ్ కామెడీ ఫుల్లుగానే ఉంది. ఇక ఏ హీరోయిన్ ఎవరికి జోడీనో అర్థం కావాలంటే సినిమాను చూడాల్సిందే.. ఆ కన్ఫ్యూజన్ పైనే సినిమాను రన్ చేసినట్టున్నారు. ఈ ట్రైలర్ లో మన రానా దగ్గుబాటి కాలకేయకు కజిన్ లా భయపెట్టే అవతారంలో కనిపించాడు.  ట్రైలర్ చూస్తే మైండ్ బ్లోయింగ్ ఎక్స్ ట్రా ఆర్దినరీ ఇండియన్ అవతార్ లాగా ఏమీ లేదు.. జస్ట్ టైం పాస్ కామెడీ.. నాలుగైదు సినిమాల ఛాయలు కూడా కనిపిస్తున్నాయి. అయితే రిచ్ ఫీల్.. నటీనటులు.. సూపర్ బ్యూటీలు ఉన్నారు. లాజిక్కులను.. ఇతర సినిమాలతో పోలికలను కృష్ణ కరకట్ట మీద పెట్టి  ట్రైలర్ ను చూసేయండి.


Full View
Tags:    

Similar News