`కేజీఎఫ్ చాప్టర్ 2`.. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఏ నోట విన్నా ఇప్పడు ఇదే మాట వినిపిస్తోంది. ఈ సినిమాపైనే చర్చ నడుస్తోంది. ప్రాంతీయ సినిమాగా విడుదలై దేశ వ్యాప్తంగా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటూ రికార్డు స్థాయి వసూళ్లని రాబడుతోంది. కన్నడ స్టార్ హీరో రాకింగ్ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కించిన ఈ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సంచనాలు సృష్టిస్తోంది. కన్నడలో తెరకెక్కిన ఈ చిత్రం ఐదు భాషల్లో సంచలన విజయాన్ని సాధిస్తూ రికార్డుల మోత మోగిస్తోంది.
ఇప్పటికే పలు రికార్డుల్ని తిరగరాసిన ఈ మూవీ 15 రోజులకు గానూ 948 కోట్లు వసూలు చేసి సరికొత్త రికార్డుని నెలకొల్పింది. రానున్న రోజుల్లో 1000 కోట్ల మార్కుని దాటబోతోంది. బాలీవుడ్ లో హిందీ వెర్షన్ ఇప్పటికే 300 కోట్ల మైలు రాయిని దాటేసి అక్కడ హాట్ టాపిక్ గా మారింది. సినిమా చూస్తున్న ప్రేక్షకులకు ఓ హాలీవుడ్ మూవీని చూసిన ఫీలింగ్ కలిగించారు. ప్రత ఈఫ్రేమ్ అద్భుతమే అనిపించారు. తెరపై కేజీఎఫ్ సామ్రాజ్యాన్ని.. ఆనాటి కాలాన్ని కళ్లకు కట్టినట్టు చూపించి ఆనాటి ప్రపంచానికి ప్రేక్షకుడిని తీసుకెళ్లడానికి టీమ్ పడిన శ్రమ అంతా ఇంతా కాదు.
కేజీఎఫ్ సెట్స్.. క్వారీల్లోని వందల మంది జనాన్ని తెరపై చూపించేందుకు కెమెరా డిపార్ట్ మెంట్ ఎంతలా శ్రమించిందో వివరిస్తూ `రూట్ టు ఎల్డోరాడో (ఎపిసోడ్ -1) పేరుతో ఓ మేకింగ్ వీడియోని `కేజీఎఫ్` టీమ్ విడుదల చేసింది. ఈ చిత్రానికి భువన్ గౌడ కెమెరామెన్ గా పని చేశారు. తాను, తన టీమ్ ఈ ప్రపంచాన్ని వెండితెరపై ఆవిష్కరించడానికి ఎంతగా శ్రమించాల్సి వచ్చిందో వివరించారు. కేజీఎఫ్ సామ్రాజ్యం నరాచీని రియలిస్టిక్ గా ఆవిష్కరించడంలో ఆర్ట్ డైరెక్టర్ పాత్ర ఎంత వుందో దాన్ని అంతే ఎఫెక్టీవ్ గా తెరపైకి తీసుకురావడంతో కెమెరా డిపార్ట్ మెంట్ పడిన శ్రమ కూడా అంతే వుంది.
రోజుకు 12 గంటలు శ్రమించారట. వందల మంది కనిపించే సీన్‌లు, బ్లాస్టింగ్ తో దుమ్ము లేస్తున్నా అవన్నీ భరించి తెరపై ఎఫెక్టీవ్ గా చూపించడానికి కెమెరా మోన్ భువన్ గౌడ అతని టీమ్ కఠోరంగా శ్రమించారట. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తోంది. కాగడ లైట్ లో వీరు షూట్ చేసిన తీరు మైండ్ బ్లోయింగ్ అనిపించకమానదు.
అధీరా టీమ్‌కు సంబంధించిన చాలా వరకు సన్నివేశాలని చీకట్లో కాగడా లైట్ లో చిత్రీకరించిన తీరు ప్రతీ ఒక్కరినీ అబ్బురపరుస్తుంది. `ప్రశాంత్ నీల్ - యష్ కాంబినేషన్ కు తిరుగులేదు. సినిమానే వారి ప్రపంచం. ఈ సినిమా కోసం నిర్విరామంగా 12 గంటలు పనిచేసేవాళ్లం. 10 రోజులు అనుకున్న షెడ్యూల్ 8 రోజులకే ముగిసేది.
నరాచీ నేపథ్యంలో వందల మంది కనిపించే సీన్ లు.. కార్ల బ్లాస్టింగ్ సన్నివేశాలను ఓ సవాల్ గా స్వీకరించాం. సెట్స్ లో అడుగుపెట్టిన తొలి నాళ్లలో కొంత ఇబ్బంది అనిపించింది. అయితే ఆ తరువాత ఆ కష్టం ఇష్టంగా మారింది. ఈ చిత్రానికి పని చేసిన ప్రతీ టెక్నీషియన్ ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నారు.
భారతీయ సినీ అభిమానులకు మంచి చిత్రాన్ని ఇవ్వాలని ప్రతీ ఒక్కరం ఆసక్తిగా పని చేశాం. ఈ ఐదేళ్ల ప్రయాణంలో ఎందో ఆనందాన్ని పొందాం` అని డీవోపీ టీమ్ వెల్లడించింది. కేజీఎఫ్ సామ్రాజ్యాన్ని వెండితెరపై అంతే ఎఫెక్టీవ్ గా ఆవిష్కరించడం కోసం డీవోపీ టీమ్ ఏ స్థాయిలో శ్రమించిందో ఈ వీడియోలో చూడండి.
Full View