ఫోటో స్టోరి: హూ ఈజ్ దిస్ ట‌వ‌ల్ మ్యాన్?

Update: 2020-03-02 10:30 GMT
ఇండియ‌న్ సూప‌ర్ హీరోగా హృతిక్ రోష‌న్ కి ఉన్న క్రేజు గురించి చెప్పాల్సిన ప‌నే లేదు. ఫ్యామిలీ జీవితంలో డిస్ట్ర‌బెన్సెస్..అనూహ్యంగా భార్య సుజానే నుంచి విడాకులు స‌హా ప్ర‌మాద‌క‌ర‌ క్యాన్స‌ర్ అత‌డిని తీవ్ర మ‌నోవేద‌న‌కు గురి చేసాయి. అయినా వాట‌న్నిటినీ త‌ట్టుకుని అత‌డు కంబ్యాక్ అయిన తీరు ఓ సెన్సేష‌న్ అనే చెప్పాలి.

ఒక‌ ర‌కంగా హృతిక్ రియ‌ల్ సూప‌ర్ మేన్.. ఐర‌న్ మేన్ అనే పొగిడేయాలి. వ‌రుస‌గా భారీ యాక్ష‌న్ చిత్రాల‌తో అత‌డు ఇర‌గ‌దీస్తున్నాడు. ఇటీవ‌లే వార్ సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టాడు. ఈ మూవీ కోసం బాగా ఫ్యాట్ తో ఉన్న హృతిక్ జిమ్ముల్లో శ్ర‌మించి కేజీల కొద్దీ బరువు త‌గ్గాడు. తాజాగా హృతిక్ బీచ్ ప‌రిస‌రాల్లో రిలాక్స్ అవుతూ క‌నిపించాడు. ఏదో బీచ్ రిసార్ట్ లో ఇదిగో ఇలా ట‌వ‌ల్ చుట్టుకుని స్విమ్మింగ్ పూల్ లోకి వెళుతున్న‌ట్టే క‌నిపిస్తున్నాడు. మ్యాకోమ్యాన్ లుక్ తో ప‌ర్ఫెక్ట్ ఫిట్ బాడీ తో హృతిక్ మాయ చేస్తాడ‌నంలో సందేహం లేదు. అందుకే అత‌డిని గ్రీక్ గాడ్ గా పూజిస్తుంటారు గాళ్స్.
Tags:    

Similar News